సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Krishna Vamsi: థియేటర్‌లోనే రంగమార్తండ!

ABN, First Publish Date - 2022-06-26T16:11:11+05:30

క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ చాలాకాలంగా హిట్‌ సినిమా ఇవ్వడం కోసం తపన పడుతున్నారు. ఆయన నుంచి తనదైన మార్క్‌ సినిమా వచ్చి దాదాపు ఎనిమిదేళ్లు అవుతోంది. ‘రంగమార్తాండ’ చిత్రంతో జనాలకు తన మార్క్‌ రుచి రూపించాలనుకుంటున్నారు కేవీ. అయితే ఈ సినిమాకూ తిప్పలు తప్పడం లేదు. సినిమా షూటింగ్‌ ప్రారంభమై చాలాకాలమైంది. అయితే పది శాతం చిత్రీకరణ ఉందనగా ఆర్థిక సమస్యల వల్ల షూటింగ్‌ ఆగిపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ (Krishna vamsi)చాలాకాలంగా హిట్‌ సినిమా ఇవ్వడం కోసం తపన పడుతున్నారు. ఆయన నుంచి తనదైన మార్క్‌ సినిమా వచ్చి దాదాపు ఎనిమిదేళ్లు అవుతోంది. ‘రంగమార్తాండ’(rangamarthandaచిత్రంతో జనాలకు తన మార్క్‌ రుచి చూపించాలనుకుంటున్నారు కేవీ. అయితే ఈ సినిమాకూ తిప్పలు తప్పడం లేదు. సినిమా షూటింగ్‌ ప్రారంభమై చాలాకాలమైంది. అయితే పది శాతం చిత్రీకరణ ఉందనగా ఆర్థిక సమస్యల వల్ల షూటింగ్‌ ఆగిపోయింది. నిర్మాతలకు డబ్బు సర్దుబాటు కాక చిత్రీకరణ నిలిచిపోయింది. అయితే ఈ చిత్రానికి తాజాగా ఓ పెద్ద ఓటీటీ నుంచి మంచి ఆఫర్‌ రావడంతో మళ్లీ సినిమాకు మంచి రోజులొచ్చాయని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే సందర్భంలో నిర్మాతలకు డబ్బు సర్దుబాటు అవ్వడంతో.. మిగిలిని షూటింగ్‌ని పూర్తి చేయడానికి సిద్ధమయ్యారని, త్వరలోనే షూటింగ్‌ మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆగస్ట్‌లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. గతంలో కూడా ఈ చిత్రానికి ఒక ఓటీటీ రూ. 20 కోట్ల ఆఫర్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే దర్శకుడు కృష్ణవంశీ ఈ చిత్రాన్ని థియేటర్‌లో విడుదల చేయాలని భావిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్‌, బ్రహ్మానందం, రమ్యకృష్ణ (Ramya krishna) కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరాఠీలో భారీ విజయం సాధించిన ‘నటసామ్రాట్‌’ చిత్రానికి రీమేక్‌ ఇది. మరి కథతోనైనా కృష్ణవంశీ తన సత్తాను చూపిస్తారని అభిమానులు భావిస్తున్నారు. ఈ చిత్రానికి చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడం విశేషం. (Prakash raj)


Updated Date - 2022-06-26T16:11:11+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!