సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

RangaMarthanda లేటెస్ట్ అప్‌డేట్..

ABN, First Publish Date - 2022-07-02T20:14:35+05:30

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ (Krishna Vamsi) స్వయంగా తన దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'రంగమార్తాండ' (RangaMarthanda) సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ (Krishna Vamsi) స్వయంగా తన దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'రంగమార్తాండ' (RangaMarthanda) సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు. కుటుంబ కథా చిత్రాలను రూపొందించడంలో కృష్ణ వంశీకి ఉన్న ప్రత్యేకత గురించి అందరికీ తెలిసిందే. తనదైన శైలిలో భావోద్వేగాల్ని జోడించి తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు. అయితే 'మహాత్మ' తరువాత ఆయన నుంచి ఒక్క హిట్ మూవీ రాలేదు.  'మహాత్మ' తరువాత నాలుగు సినిమాలు చేసినా ఒక్కటి కూడా హిట్‌గా నిలవలేదు. 


ప్రస్తుతం ఆయన రూపొందిస్తున్న తాజా చిత్రం 'రంగ మార్తాండ'. మారఠీలో విలక్షణ నటుడు నానా పటేకర్ (Nana Patekar) నటించగా సూపర్ హిట్ అయిన 'నట సామ్రాట్' (Natsamrat) చిత్రానికిది అఫీషియల్ రీమేక్. ఈ సినిమా ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకుని ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను జరుపుకుంటోంది. ఇందులో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj), రమ్యకృష్ణ (Ramya Krishna) ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. బ్రహ్మానందం, శివాత్మిక రాజశేఖర్ (Shivathmika Rajashekhar), అనసూయ (Anasuya), రాహుల్ సిప్లిగంజ్, అలీ రెజా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. 


అయితే, ఈ సినిమాకు ఓ పాపులర్ ఓటీటీ ఆఫర్ ఇవ్వడంతో నిర్మాణం ఊపందుకుందని, వారి సహకారం వల్లే పూర్తయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ 'రంగమార్తాండ' సినిమాను నేరుగా ఓటీటీలోనే విడుదల చేసే అవకాశం ఉందని సోషల్ మీడియా ప్రచారం జరుగుతోంది. కానీ, మేకర్స్ మాత్రం థియేటర్స్‌లోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాగా, ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ మోషన్ పోస్టర్‌ను అతి త్వరలో విడుదల చేయబోతున్నారు. స్వయంగా ఈ విషయాన్ని దర్శకుడు కృష్ణ వంశీ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. దీన్నిబట్టి చూస్తే ఇక రంగ మార్తాండ సినిమా ప్రమోషన్స్ మొదలైనట్టే అనిపిస్తోంది. ఇక ఈ మూవీకి మెగాస్టార్ వాయిస్ ఓవర్ ఇస్తున్న సంగతి తెలిసిందే.

Updated Date - 2022-07-02T20:14:35+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!