ఫస్ట్ లుక్ ‘రంగ రంగ వైభవంగా’ ఉంది
ABN , First Publish Date - 2022-01-25T01:42:15+05:30 IST
‘ఉప్పెన’ సినిమాతో సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ సాధించిన పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి బ్యానర్‌పై బాపినీడు.బి సమర్పణలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. కేతికా శర్మ హీరోయిన్గా
‘ఉప్పెన’ సినిమాతో సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ సాధించిన పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి బ్యానర్‌పై బాపినీడు.బి సమర్పణలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. కేతికా శర్మ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రం టైటిల్ లుక్ టీజర్, ఫస్ట్ లుక్‌ని చిత్రయూనిట్ సోమవారం అధికారికంగా విడుదల చేసింది. సంక్రాంతికే విడుదల కావాల్సిన ఈ ఫస్ట్ లుక్.. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా వాయిదాపడిన విషయం తెలిసిందే. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్, టీజర్ ఆసక్తికరంగా ఉండటమే కాకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
టీజర్ గమనిస్తే.. యూత్‌ని మెప్పించేలా హీరో, హీరోయిన్ మధ్య నడిచే బటర్ ఫ్లై కిస్ థియరీ కొత్తగా అనిపిస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం టీజర్‌ను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లింది. ఇక తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ టైటిల్‌కి తగ్గట్లే ‘రంగ రంగ వైభవంగా’ ఉంది. ఇందులో హీరో హీరోయిన్లు చక్కని సాంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తున్నారు. హీరోయిన్ తులసి కోట దగ్గర పూజా చేస్తుండగా.. హీరో ఆమెను టీజ్ చేస్తున్నారు. కలర్ఫుల్గా ఉన్న ఈ ఫస్ట్ లుక్ అందరినీ ఆకర్షిస్తోంది. ‘అర్జున్ రెడ్డి’ తమిళ వెర్షన్ డైరెక్ట్ చేసిన గిరీశాయ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.