తెలుగు సినిమా గర్వం... Prabhas!

ABN , First Publish Date - 2022-06-01T02:46:11+05:30 IST

ఇటీవల జరిగిన ‘ఆచార్య’ (Acharya) ప్రీ రిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi) మాట్లాడుతూ.. ఒక అవార్డుల వేడుకకి వెళితే.. అక్కడ తెలుగు వాళ్లకి సరైన గౌరవం దక్కలేదు అని చెబుతూ.. ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ ఆవేదనకి ముగింపు పలికిన

తెలుగు సినిమా గర్వం... Prabhas!

ఇటీవల జరిగిన ‘ఆచార్య’ (Acharya) ప్రీ రిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi) మాట్లాడుతూ.. ఒక అవార్డుల వేడుకకి వెళితే.. అక్కడ తెలుగు వాళ్లకి సరైన గౌరవం దక్కలేదు అని చెబుతూ.. ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ ఆవేదనకి ముగింపు పలికిన టాలీవుడ్ హీరో గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas). ప్రస్తుతం ఇండియాలో ప్రభాస్ అనే పేరు తెలియని వాడు, ఆ కటౌట్‌ని ఇష్టపడని వాడు ఉండరు. స్వతహాగానే ప్రభాస్ చాలా నిదానస్తుడు, వ్యక్తిగతంగా చాలా మంచి వాడని కూడా పేరుంది. బాలీవుడ్ సెలబ్రిటీస్‌లో కూడా ప్రభాస్‌పై మంచి క్రేజ్ ఉంది. ఈ విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసిన సంఘటన తెలుగు రాష్ట్రంలో జరిగింది. 


బాలీవుడ్ స్టార్ హీరో, ఫ్యూచర్‌లో బాలీవుడ్‌ని శాసించే సత్తా ఉన్న నటుడు రణబీర్ కపూర్‌ (Ranbir Kapoor). వచ్చింది లెజండరీ ఫ్యామిలీ నుండైనా.., తన బ్యాక్‌గ్రౌండ్‌ని వాడుకోకుండా యాక్టింగ్‌తో మెప్పించిన ఈ హీరో.. ప్రస్తుతం ‘బ్రహ్మాస్త్ర’ (Brahmāstra) అనే టైటిల్‌తో పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు. ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దక్షిణాది భాషల్లో రాజమౌళి (Rajamouli) ముందుండి ప్రమోట్ చేస్తున్నారు. జక్కన్న (Jakkanna) ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నాడంటే.. ఖచ్చితంగా సినిమాలో చాలా విషయమే ఉండి ఉంటుంది. ‘బ్రహ్మాస్త్ర పార్ట్ 1-శివ’ అనే పేరుతో రానున్న ఈ మూవీ తెలుగు ప్రమోషన్స్ మొదలెట్టిన రాజమౌళి, తాజాగా ఫిల్మ్ యూనిట్‌తో ఓ మీడియా సమావేశం నిర్వహించారు. 


ఈ సమావేశంలో రణబీర్ కపూర్‌‌ని మీ అభిమాన తెలుగు హీరో ఎవరు? అని యాంకర్ అడగగానే.. ‘‘తెలుగు హీరోలందరూ బాగా యాక్ట్ చేస్తారు.. కానీ ఒకరినే పిక్ చేసుకోవాల్సి వస్తే మాత్రం.. నేను డార్లింగ్ ప్రభాస్‌ అనే చెబుతాను. హి ఈజ్ ఏ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఐ కాల్ హిమ్, డార్లింగ్’’ అని సమాధానం ఇచ్చారు. అంతే ప్రభాస్ (Prabhas) పేరు వినగానే ఆడిటోరియం మొత్తం విజిల్స్, సౌండ్స్‌తో మోతమోగింది. రణబీర్ కపూర్‌ పక్కనే ఉన్న రాజమౌళి.. తన హీరోని బాలీవుడ్ స్టార్ హీరో గొప్పగా చెప్పడంతో గర్వంగా చిన్న నవ్వు నవ్వాడు. తెలుగు నుంచి ప్రభాస్‌కి దక్కిన గుర్తింపు ఇదంటూ.. ప్రభాస్ గురించి రణబీర్ చెబుతున్న వీడియోని సోషల్ మీడియాలో అభిమానులు వైరల్ చేస్తున్నారు.

Updated Date - 2022-06-01T02:46:11+05:30 IST

Read more