మాటలు కరువయ్యాయి: ఆర్‌జీవీ!

ABN , First Publish Date - 2022-03-28T19:25:19+05:30 IST

సినీరంగంలో వివాదాలకు కేరాఫ్‌ అయిన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. ఆయన మాటలు ఒక్కోసారి విచిత్రంగా ఉంటాయి. ఓ మనిషిని తిట్టినా, పొడిగినా, విమర్శించినా ఆయనకే క్షణాల్లో చెల్లుబాటు అవుతుంది. ఏ విషమం మీదైనా డిటైల్డ్‌గా మాట్లాడగలిగే ఆయనకు ఇప్పుడు మాటలు కరువయ్యాయట. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా చూశాక రాజమౌళి టీమ్‌పై ప్రశంసలు కురిపిస్తూ.. ఏం మాట్లాడాలో తెలియడం లేదన్నారు.

మాటలు కరువయ్యాయి: ఆర్‌జీవీ!

రాజమౌళి ప్రేక్షకులకు దొరికిన బంగారం

30 ఏళ్లల్లో ఏ చిత్రాన్ని ఇంతగా ఎంజాయ్‌ చేయలేదు

- ఆర్‌జీవీ

సినీరంగంలో వివాదాలకు కేరాఫ్‌ అయిన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. ఆయన మాటలు ఒక్కోసారి విచిత్రంగా ఉంటాయి. ఓ మనిషిని తిట్టినా, పొడిగినా, విమర్శించినా ఆయనకే క్షణాల్లో చెల్లుబాటు అవుతుంది. ఏ విషమం మీదైనా డిటైల్డ్‌గా మాట్లాడగలిగే ఆయనకు ఇప్పుడు మాటలు కరువయ్యాయట. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా చూశాక రాజమౌళి టీమ్‌పై ప్రశంసలు కురిపిస్తూ.. ఏం మాట్లాడాలో తెలియడం లేదన్నారు. సినిమా అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. ఆ మేరకు రాజమౌళికి ఆయన ఓ వాయిస్‌ లెటర్‌ ట్విట్టర్‌ వేదికగా పంపారు. 


‘‘మామూలుగా నేను ఏ విషయం మాట్లాడినా చాలా స్పష్టతతో మాట్లాడతా. కానీ మొదటిసారి నాకు మాటలు కరువయ్యాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌కు ఒకటే చెప్పాలనుకుంటున్నా. ఫేమ్‌, స్టాటస్‌ ఇవన్నీ మరచిపోయి సినిమా చూశా. ప్రతి సన్నివేశాన్ని మనస్ఫూర్తిగా ఎంజాయ్‌ చేశా. రాజమౌళి ట్రైలర్‌ విడుదల చేసినప్పుడు సినిమా బావుంటుందని భావించా. సినిమా చూశాక ఇదొక అద్భుతం అని అర్థమైంది.  ఇప్పుడు ఏం చెప్పాలో తెలియడం లేదు. జీవితంలో  మొదటిసారి నాకు మాటలు దొరకడం లేదు. కథేంటి? క్యారెక్టర్లు ఎవరు చేశారు అనేదాని కన్నా దర్శకుడు కథ చెప్పిన విధానం, స్ర్కీన్‌పై చూపించిన తీరు నన్నెంతగానో ఆకట్టుకుంది. చరణ్‌ పాత్ర బావుంది.. తారక్‌ పాత్ర ఇంకా బావుంది అనేవి అనవసరమైన  మాటలు. పాత్రలకు తగ్గట్లు ఎవరికి వాళ్లే ప్రతి సీన్‌లోనూ అదరగొట్టారు. 30 ఏళ్లలో ఇంతగా ఏ చిత్రాన్ని ఎంజాయ్‌ చేయలేదు. రాజమౌళి.. నువ్వు ప్రేక్షకులకు దొరికిన బంగారం. సినిమానే కలగా  చేసుకుని మంచి చిత్రాలు తీస్తున్నావు. దానికి సినీ ప్రేమికులు ఎంతగానో ఆనందిస్తున్నారు’’ అని వర్మ వాయిస్‌ లెటర్‌లో పేర్కొన్నారు. 


Updated Date - 2022-03-28T19:25:19+05:30 IST