‘బాహుబలి 2’ హిస్టరీ.. ‘ఆర్.ఆర్.ఆర్’ హిస్టారికల్ : రామ్ గోపాల్ వర్మ

ABN , First Publish Date - 2022-03-27T20:07:23+05:30 IST

నిత్యం వివాదాలతో సావాసం చేసే రామ్ గోపాల్ వర్మ.. ఏ విషయంపై అయినా తనదైన శైలిలో నిర్మోహమాటంగా ట్వీట్స్ చేస్తారని అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో తన శైలికి భిన్నంగా పాజిటివ్ గా స్పందిస్తూ .. ఆశ్చర్యపరుస్తున్నారు. నిన్నటికి నిన్న ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీని ఎంతో ప్రశంసిస్తూ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిని పొగడ్తలతో ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఇక లేటెస్ట్ గా వర్మ .. రాజమౌళి క్రేజీ మల్టీస్టారర్ పై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పి అభిమానుల్ని ఖుషీ చేశారు. ఇంతకీ వర్మ ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఏమన్నారంటే...

‘బాహుబలి 2’ హిస్టరీ... ‘ఆర్.ఆర్.ఆర్’ హిస్టారికల్ ..  బాక్సాఫీస్ అద్భుతాలు తీసే రాజమౌళి మిస్టికల్ అని ట్వీట్ చేశారు. వర్మ చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజమని ఒప్పుకోవాలి. ‘బాహుబలి 2’ లాంటి సెన్సేషనల్ చిత్రాన్ని రాజమౌళి మళ్లీ తీయమంటే తీయలేరు. నిజంగా తెలుగు సినీ తెరపై ఆ సినిమా ఒక చరిత్ర. అలాగే ‘ఆర్.ఆర్.ఆర్’ లాంటి  హిస్టారికల్ ఫిక్షనల్ మూవీని రాజమౌళి తప్ప మరెవరూ ముట్టుకోడానికే సాహసించరు. కాబట్టి.. ఆ సినిమా ఒక హిస్టారికల్. ఇక ఇలాంటి సినిమాలు ఆయన మాత్రమే తీయగలరు. కాబట్టి.. ఆయనో మిస్టికల్. సో.. ఆయన టేకింగ్, మేకింగ్ అంతా ఒక స్పిరిట్యువల్. అనే అర్ధం వచ్చేలా వర్మ తనదైన శైలిలో ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Updated Date - 2022-03-27T20:07:23+05:30 IST