నట్టి కుమార్‌కు ఇంపార్టెన్స్‌ ఇచ్చేంత సీన్‌ లేదు: ఆర్‌జీవీ!

ABN , First Publish Date - 2022-04-08T04:01:15+05:30 IST

దర్శకుడు రామ్‌గోపాల్‌ తీసిన గత చిత్రాలకు స్నేహితులతో కలిసి ఫైనాన్స్‌ చేశానని, సుమారు రూ.5 కోట్ల 29 లక్షలు తిరిగి ఇవ్వకుండా వర్మ తప్పించుకుని తిరుగుతున్నాడంటూ నిర్మాత నట్టికుమార్‌ ఆరోపణలు చేశారు. ఈ మేరకు వర్మ దర్శకత్వం వహించిన ‘మా ఇష్టం’ (డేంజరస్‌) చిత్రం విడుదల కాకుండా కోర్టు నుంచి స్టే తీసుకొచ్చారు నట్టికుమార్‌.

నట్టి కుమార్‌కు ఇంపార్టెన్స్‌ ఇచ్చేంత సీన్‌ లేదు: ఆర్‌జీవీ!

దర్శకుడు రామ్‌గోపాల్‌ తీసిన గత చిత్రాలకు స్నేహితులతో కలిసి ఫైనాన్స్‌ చేశానని, సుమారు రూ.5 కోట్ల 29 లక్షలు తిరిగి ఇవ్వకుండా వర్మ తప్పించుకుని తిరుగుతున్నాడంటూ నిర్మాత నట్టికుమార్‌ ఆరోపణలు చేశారు. ఈ మేరకు వర్మ దర్శకత్వం వహించిన ‘మా ఇష్టం’ (డేంజరస్‌) చిత్రం విడుదల కాకుండా కోర్టు నుంచి స్టే తీసుకొచ్చారు నట్టికుమార్‌. తనపై చేసిన ఆరోపణలపై రామ్‌గోపాల్‌ వర్మ ఓ వీడియో ద్వారా స్పందించారు. ‘‘నట్టికుమార్‌ నాపై చేసిన ఆరోపణలు, అభియోగాలు లీగల్‌గా ఉండి నోటీసులు ఇస్తే, వాటికి నా అడ్వకేట్‌ సరైన సమాధానం ఇస్తారు. ఇక వ్యక్తిగతంగా నాపై చేసిన ఆరోపణలకు నేనేం చెప్పను. దానికి సమాధానం ఎలా చెప్పాలో నాకు తెలుసు. ఎందుకంటే నట్టి కుమార్‌ గురించి అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో ఎవరో ఒకరి మీద ఆరోపణలు చేయడం, ప్రెస్‌మీట్స్‌ పెట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మినహా అతను పెద్దగా చేసేది కూడా ఏమీ లేదు. గతంలో చిరంజీవిగారు, సురేశ్‌బాబు మీద ఇలాగే ప్రెస్‌మీట్‌ పెట్టి ఆరోపణలు చేశారు. ఇప్పుడు నాపైన చేస్తున్నాడు. తన కొడుకు, కూతురులతో తీసిన సినిమాకు పెద్దగా ప్రమోషన్‌ చేయలేదని, రావల్సిన కమీషన్‌ రాలేదని కొందరిని దూషించాడు. అతను లీగల్‌గా నా అడ్వకేట్‌ లీగల్‌గా చూసుకుంటారు. ఇంకోలా వస్తే... దానికి నేను సమాధానం చెప్పగలను. నా సినిమా రిలీజ్‌ వాయిదా పడడం ఈ కారణంతో కాదు. దానికి సమాధానం త్వరలో చెబుతా. ఇకపై నట్టి కుమార్‌ గురించి నేను ఎక్కడా మాట్లాడను. ఎందుకంటే నేను ఇంపార్టెన్స్‌ ఇచ్చే అంత సీన్‌, అర్హత అతనికి లేదు. లీగల్‌ ఆస్పెక్ట్‌లో ఏం చేసిన మా అడ్వకేట్‌ చూసుకుంటారు’’ అని అన్నారు. 


Updated Date - 2022-04-08T04:01:15+05:30 IST

Read more