సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

రమేశ్ బాబు ప్రయోగాత్మక చిత్రం ‘నీడ’

ABN, First Publish Date - 2022-01-09T16:08:33+05:30

హీరో కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్ బాబు తన 15 ఏళ్ల వయసులో ‘నీడ’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. అంతకుముందు తమ సొంత చిత్రాల్లో అతను బాల నటుడిగా కనిపించినా, ప్రముఖ పాత్ర పోషించింది ఈ సినిమా లోనే. ఇందులో రమేశ్ చిన్నప్పటి పాత్రను మహేశ్ బాబు పోషించడం విశేషం. తొలిసారిగా బొట్టు పెట్టి అతని ఉజ్వల భవిష్యత్తు కు అలా నాంది పలికారు దర్శకరత్న దాసరి నారాయణరావు. ఈ సినిమాలో మరో కీలకమైన పాత్ర ను ఆర్. నారాయణ మూర్తి పోషించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హీరో కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్ బాబు తన 15 ఏళ్ల వయసులో ‘నీడ’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. అంతకుముందు తమ సొంత చిత్రాల్లో అతను బాల నటుడిగా కనిపించినా, ప్రముఖ పాత్ర పోషించింది ఈ సినిమా లోనే. ఇందులో రమేశ్ చిన్నప్పటి పాత్రను మహేశ్ బాబు పోషించడం విశేషం. తొలిసారిగా బొట్టు పెట్టి అతని ఉజ్వల భవిష్యత్తు కు అలా నాంది పలికారు దర్శకరత్న దాసరి నారాయణరావు. ఈ సినిమాలో మరో కీలకమైన పాత్ర ను ఆర్. నారాయణ మూర్తి పోషించారు. 

‘నీడ’ షూటింగ్ మొత్తం విజయవాడ లో జరిగింది. కేవలం పది రోజుల్లో తయారైన పది రీళ్ళ చిత్రం ఇది. ఎదిగే పిల్లల మీద వారు పెరిగే వాతావరణం, పరిస్థితులు, చుట్టూ పక్కల వాళ్ళ మనస్తత్వం, సినిమాలు ఎటువంటి ప్రభావం చూపిస్తాయో నీడ చిత్రంలో వివరంగా చూపించారు దాసరి. పాటలు లేని తెలుగు సినిమా ను ఊ హించలేని రోజుల్లో దాసరి చేసిన సరికొత్త ప్రయోగం నీడ. 1979 నవంబర్ 29 న ఈ చిత్రం విడుదల అయింది

వినాయకరావు

Updated Date - 2022-01-09T16:08:33+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!