Acharya : ఆకట్టుకుంటోన్న ‘సిద్ధ’ లుక్
ABN , First Publish Date - 2022-03-27T16:35:04+05:30 IST
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తాజాగా ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంతో ప్రేక్షకులకు ముందుకొచ్చాడు. సినిమాకి యునానిమస్‌గా బ్లాక్‌బస్టర్ టాక్ రావడంతో మెగా, నందమూరి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. తొలిరోజు రికార్డు స్థాయి కలెక్షన్స్ వసూలు చేసి మరోసారి రాజమౌళి స్టామినా ఏంటో తెలియచెప్పింది. ఇక దీని తర్వాత చెర్రీ నటించిన ‘ఆచార్య’ మూవీపైనే ఉంది అందరి దృష్టి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ మెసేజ్ ఓరియెంటెడ్ యాక్షన్ మూవీలో రామ్ చరణ్ ‘సిద్ధ’ అనే పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తండ్రీ కొడుకులిద్దరూ తొలిసారిగా స్ర్కీన్ షేర్ చేసుకుంటున్న ఈ సినిమాని ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేయబోతున్నారు.

మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తాజాగా ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంతో ప్రేక్షకులకు ముందుకొచ్చాడు. సినిమాకి యునానిమస్‌గా బ్లాక్‌బస్టర్ టాక్ రావడంతో మెగా, నందమూరి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. తొలిరోజు రికార్డు స్థాయి కలెక్షన్స్ వసూలు చేసి మరోసారి రాజమౌళి స్టామినా ఏంటో తెలియచెప్పింది చిత్రం. ఇక దీని తర్వాత చెర్రీ నటించిన ‘ఆచార్య’ మూవీపైనే ఉంది అందరి దృష్టి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ మెసేజ్ ఓరియెంటెడ్ యాక్షన్ మూవీలో రామ్ చరణ్ ‘సిద్ధ’ అనే పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తండ్రీ కొడుకులిద్దరూ తొలిసారిగా స్ర్కీన్ షేర్ చేసుకుంటున్న ఈ సినిమాని ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేయబోతున్నారు. ఈ రోజు (ఆదివారం ) రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా అతడికి శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘ఆచార్య’ చిత్రంలోని చెర్రీ పోషించిన సిద్ధ లుక్ ను విడుదల చేశారు మేకర్స్.
ఫ్లూట్ పై చెర్రీ డిజైన్ వేస్తున్న క్లాస్ లుక్ మెప్పిస్తోంది. ఇందులో చరణ్ కు జోడీగా నీలాంబరి పాత్రలో అందాల పూజా హెగ్డే నటిస్తోంది. ఇంతకు ముందు ఈ ఇద్దరిపైనా చిత్రీకరించిన నీలాంబరి అనే సాంగ్ అభిమానుల్ని మెప్పించింది. ఏప్రిల్ మొదటి వారంలో ‘ఆచార్య’ చిత్రం ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు మేకర్స్. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న చిత్రం ఇటీవల తాజా షెడ్యూల్ ను మొదలు పెట్టింది. మధ్యలో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం ప్రమోషన్స్ లో చెర్రీ పాల్గొనడంతో శంకర్ చిత్రానికి కొద్దిరోజులు బ్రేక్ ఇచ్చారు. త్వరలో రామ్ చరణ్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. అలాగే.. ఏప్రిల్ నుంచి ‘ఆచార్య’ ప్రమోషన్స్ ను మొదలు పెట్టబోతున్నాడు.