సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Ramarao On Duty.. ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే?

ABN, First Publish Date - 2022-07-13T01:43:08+05:30

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) హీరోగా నూతన దర్శకుడు శరత్ మండవ (Sarath Mandava) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’ (Ramarao On Duty). శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) హీరోగా నూతన దర్శకుడు శరత్ మండవ (Sarath Mandava) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’ (Ramarao On Duty). శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, రవితేజ టీం వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) నిర్మిస్తోన్న ఈ చిత్రం జూలై 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టుకోగా.. ఇప్పుడు ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా నిర్మాత అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ఈ నెల 16న ఉదయం 11గంటల 07 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ  పోస్టర్‌లో రవితేజ  బ్లాక్ టీని ఎంజాయ్ చేస్తూ కనిపించారు. టీజర్‌ సినిమాలోని యాక్షన్‌ సైడ్‌ని చూపించగా, ట్రైలర్‌‌ సినిమాపై మరింతగా అంచనాలను పెంచేదిగా ఉంటుందని చిత్రబృందం భావిస్తోంది.


1995 నాటి నేపథ్యంలో యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో రవితేజ సరసన రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా.. వేణు తొట్టెంపూడి చాలా గ్యాప్ తర్వాత ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా.. మరోవైపు ప్రచార కార్యక్రమాలను కూడా వినూత్నంగా నిర్వహించేందుకు చిత్రయూనిట్ ప్రయత్నాలు చేస్తోంది. నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, ‘సర్పట్ట’ఫేమ్ జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ వంటి వారు ఇతర పాత్రలలో నటిస్తో్న్న ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు.



Updated Date - 2022-07-13T01:43:08+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!