సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Ramarao On Duty: ‘సొట్టల బుగ్గల్లో’.. రవితేజ, దివ్యాంశ కెమిస్ట్రీ అదిరింది

ABN, First Publish Date - 2022-05-08T04:27:08+05:30

మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) హీరోగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‪పి, (రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల‪పై సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) నిర్మాణంలో.. దర్శకుడు శరత్ మండవ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) హీరోగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‪పి, (రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల‪పై సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) నిర్మాణంలో.. దర్శకుడు శరత్ మండవ (Sarath Mandava) తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. రవితేజ సరసన రజిషా విజయన్ (Rajisha Vijayan), దివ్యాంశ కౌశిక్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం సీనియర్ నటుడు వేణు తొట్టెంపూడి (Venu Thottempudi) ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇప్పటికే  మ్యూజిక్ ప్రమోషన్స్‪ని చిత్రయూనిట్ మొదలెట్టింది. మొదటి సింగిల్ ‘బుల్ బుల్ తరంగ్’ని ఇప్పటికే విడుదల చేసిన చిత్రయూనిట్.. తాజాగా సెకండ్ సింగిల్ ‘సొట్టల బుగ్గల్లో’ (Sottala Buggallo)నూ విడుదల చేసింది. రవితేజ (Ravi Teja), దివ్యాంశ కౌశిక్‌ (Divyansha Kaushik)లపై చిత్రీకరించిన ఈ సెకండ్ సింగిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


‘‘నేనేనా.. నేనేనా.. నిన్న మొన్నా ఉన్నది మరి నేనేనా..

నిన్నేనా.. నిన్నేనా.. ఇన్నాళ్లుగా చూస్తున్నది నిన్నేనా..

మీసాల ఆసామివేరా.. మీటితే నవ్వుల నగారా..

పొంగనే బంగారంరా.. కొంగున ముడి నువ్వేరా..

మాయగా ఉన్నాదిలేరా.. మాయ నీ ప్రేమ పహారా..

నీతోటి ఏకాంతాలే.. చాలని నిధివేరా.. ’’ అనే లిరిక్స్ తో సాగిన ఈ పాటకి కళ్యాణ్ చక్రవర్తి (Kalyan Chakravarthy) సాహిత్యం అందించగా.. హరిప్రియ (Haripriya), నకుల్ అభ్యంకర్ (Nakul Abhyankar) లవ్లీగా ఆలపించారు. ఈ పాట కోసం సంగీత దర్శకుడు సామ్ సిఎస్ (Sam CS) అందమైన రొమాంటిక్ మెలోడీ ట్యూన్ కంపోజ్ చేశారు. ఈ పాటలో  రవితేజ, దివ్యాంశ కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. పాటలో రవితేజ స్టైలిష్‌గా కనిపించగా, దివ్యాన్ష చీరలో అందంగా కనిపించింది. విజువల్స్ లావిష్‌గా వున్నాయి. రవితేజ్ చేసిన క్లాసీ డ్యాన్స్ స్టెప్స్ కూడా చక్కగా ఉన్నాయి. కాగా, యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‪లో నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, ‘సర్పట్ట’ఫేమ్ జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి వంటివారు ఇతర పాత్రలలో నటిస్తున్నారు.



Updated Date - 2022-05-08T04:27:08+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!