సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Ramarao on duty: ‘నా పేరు సీసా... అందిస్తాను స్వర్గానికి వీసా’

ABN, First Publish Date - 2022-07-03T00:31:31+05:30

‘నా పేరు సీసా.. నా పేరు సీసా’ అంటూ మత్తెక్కించే మాస్‌ మసాలా సాంగ్‌లో అలరించారు శ్రేయాగోషాల్‌. రవితేజ హీరోగా శరత్‌ మండవ దర్శకత్వం వహిస్తున్న ‘రామారావు ఆన్‌ డ్యూటీ’లో పాట ఇది. రెండు రోజులు ఈ పాట ప్రొమోతో నెట్టింట హల్‌చల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. లిరికల్‌ సాంగ్‌ను శనివారం విడుదల చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘నా పేరు సీసా.. నా పేరు సీసా’ అంటూ మత్తెక్కించే మాస్‌ మసాలా సాంగ్‌లో అలరించారు శ్రేయాగోషాల్‌. రవితేజ హీరోగా శరత్‌ మండవ దర్శకత్వం వహిస్తున్న ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ (ramarao on duty)లో పాట ఇది. రెండు రోజులు ఈ పాట ప్రొమోతో నెట్టింట హల్‌చల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. లిరికల్‌ సాంగ్‌ను శనివారం విడుదల చేశారు. (Ravi teja, Sarath mandava)

‘‘నా పేరు సీసా (సీకాకులం సారంగి)

నా పేరు సీసా

ఒకరికి నే తేనె సీసా

ఒకరికి నే కల్లు సీసా

ఒకరికినే  మసాలా సీసా

ఇంకొకరికి రసాల సీసా 

అందరికీ అందిస్తాను స్వర్గానికి వీసా’’ 

అంటూ సాగే ఈ పాటకు చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. శ్యామ్‌ సిఎస్‌ స్వరాలందించారు. శ్రేయా ఘోషల్‌ (shreya ghoshal)ఆలపించారు.ఈ పాటతో అన్వేషి జైన్‌ టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఆమెతో డాన్స్‌తోపాటు గ్లామర్‌ పాటకు ప్రత్యేక ఆకర్షణ కాగా, ఆమె వేసిన స్టెప్పులు ప్రేక్షకుల్ని కట్టిపడేసేలా ఉన్నాయనీ, థియేటర్‌ దద్దరిల్లిపోవడం ఖాయమంటూ  నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో దివ్యాంశ కౌశిక్‌,  రజిసా విజయన్‌, నాయికలు.  శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్పీ, రవితేజ టీం వర్క్స్‌ బ్యానర్లపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉంది. ఈ నెల 29న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేేసందుకు సన్నాహాలు చేస్తున్నారు.






Updated Date - 2022-07-03T00:31:31+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!