‘బుల్ బుల్ తరంగ్’తో డ్యూటీ ఎక్కుతోన్న ‘రామారావు’

ABN , First Publish Date - 2022-04-08T00:22:19+05:30 IST

మాస్ మహారాజా రవితేజ హీరోగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల‌పై శరత్ మండవ దర్శకత్వంలో.. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్

‘బుల్ బుల్ తరంగ్’తో డ్యూటీ ఎక్కుతోన్న ‘రామారావు’

మాస్ మహారాజా రవితేజ హీరోగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల‌పై శరత్ మండవ దర్శకత్వంలో.. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా చిత్ర ఫస్ట్ సింగిల్ ‘బుల్ బుల్ తరంగ్‌’ని ఏప్రిల్ 10న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 


ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. సామ్ సిఎస్ సంగీతం అందించిన ఈ పాట.. రవితేజ, రజిషా విజయన్‌పై చిత్రీకరించాము. ఈ రొమాంటిక్ లవ్లీ మెలోడీలో రవితేజ, రజిషాల కెమిస్ట్రీ చూడముచ్చటగా వుంటుంది. ఫారిన్ డ్యాన్సర్ల‌తో స్పెయిన్‌లో ఈ పాటని చాలా లావిష్‌గా చిత్రీకరించాం. ఇప్పటికే విడుదలైన చిత్ర పోస్టర్‌లు, టీజర్ అలరించినట్లుగానే.. ఏప్రిల్ 10న విడుదలయ్యే ఈ పాట శ్రోతల్ని మెప్పిస్తుంది.’’ అని అన్నారు. 


ఇక ఈ పాట విడుదల విషయాన్ని తెలుపుతూ వదిలిన పోస్టర్‌లో రవితేజ, రజిషా జోడి బ్యూటిఫుల్ అండ్ స్టయిలీష్‌గా ఉంది. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో దివ్యాంశ కౌశిక్‌ మరో హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - 2022-04-08T00:22:19+05:30 IST

Read more