Ram: 'ది వారియర్' విడుదల తేదీ వచ్చేసింది..

ABN , First Publish Date - 2022-03-27T15:41:20+05:30 IST

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ది వారియర్'. ఈ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది. తెలుగు, తమిళ్ భాషలలో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కోలీవుడ్ మాస్ డైరెక్టర్ ఎన్.లింగుసామి దర్శకత్వం వహిస్తున్నాడు.

Ram: 'ది వారియర్' విడుదల తేదీ వచ్చేసింది..

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ది వారియర్'. ఈ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది. తెలుగు, తమిళ్ భాషలలో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కోలీవుడ్ మాస్ డైరెక్టర్ ఎన్.లింగుసామి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో రామ్ పోతినేని సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఆది పినిశెట్టి విలన్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా విడుదల తేదీని ప్రకటించింది. వరల్డ్ వైడ్‌గా జూన్ 14వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో తెలుగు, తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. 


ఈ మేరకు విడుదల తేదీని తెలుపుతూ కొత్త పోస్టర్‌ను వదిలారు. కాగా, కెరీర్‌లో మొదటిసారి రామ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. అక్షర గౌడ, నదియా తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండగా, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. 

Updated Date - 2022-03-27T15:41:20+05:30 IST