సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

The Warrior : టీజర్ వచ్చేస్తోంది.. !

ABN, First Publish Date - 2022-05-08T17:54:55+05:30

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) గతేడాది ‘రెడ్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు. సినిమా ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. దాంతో తదుపరి చిత్రం విషయంలో జాగ్రత్తగా అడుగులేస్తున్నాడు. లింగుసామి దర్శకత్వంలో ప్రస్తుతం ‘ది వారియర్’ అనే మూవీలో నటిస్తున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) గతేడాది ‘రెడ్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు. సినిమా ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది.  దాంతో తదుపరి చిత్రం విషయంలో జాగ్రత్తగా అడుగులేస్తున్నాడు. లింగుసామి దర్శకత్వంలో ప్రస్తుతం ‘ది వారియర్’ అనే మూవీలో నటిస్తున్నాడు. తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. శ్రీనివాసా సిల్వర్ స్ర్కీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కృతిశెట్టి (Krithi shetty) కథానాయికగా నటిస్తోంది. ఆది పినిశెట్టి (Adi Pinishetty) విలన్ గా నటిస్తుండడం విశేషం. రామ్ పోతినేని (Ram Pothineni)  తన కెరీర్ లోనే మొట్టమొదటి సారిగా చేయబోతున్న కాప్ స్టోరీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలోని రామ్ మేకోవర్ కు మంచి స్పందన దక్కుతోంది.  ఒక మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్‌ కోసం రంగంలోకి దిగిన పోలీసాఫీసర్ రామ్‌కు ఎలాంటి సవాళ్ళు ఎదురయ్యాయి అనేదే ఈ సినిమా కథాంశం. 


ఈ చిత్రాన్ని జూలై 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో ‘ది వారియర్’ (The Warrior) చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ను ఈనెల 14 సాయంత్రం 5 గంటల 31 నిమిషాలకు  విడుదల చేస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు మేకర్స్. బుల్లెట్‌పై అగ్రెసివ్‌గా రివీలైన రామ్ పోతినేని (Ram Pothineni) లుక్ ఆకట్టుకుంటోంది. ‘రన్, పందెంకోడి సిరీస్, సికిందర్’ చిత్రాలతో మెప్పించిన లింగుసామి తొలి సారిగా తెలుగులో చేస్తున్న ఈ సినిమా కావడంతో మరింత హైప్ క్రియేట్ అయింది. యాక్షన్ చిత్రాల్ని తీయడంలో తన మార్క్ చూపించే అతడు.. రామ్‌తో ఏ స్థాయిలో సినిమా తెరకెక్కిస్తాడనే ఆసక్తి మొదలైంది. 


‘ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ పోతినేని (Ram Pothineni) నటిస్తోన్న మరో సూపర్ యాక్షన్ మూవీగా  ‘ది వారియర్’ (The Warrior) చిత్రం తెరకెక్కుతోంది. ఈ మధ్యకాలంలో ఈ తరహా పోలీస్ ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ చిత్రాలు తెలుగులో రాలేదు. అందుకే ఈ సినిమా గురించి అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ సింగిల్ మొన్నామధ్య విడుదలై.. మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. మరో రెండు నెలల్లో థియేటర్స్ లోకి రాబోతున్న ‘ది వారియర్’ (The Warrior) చిత్రం రామ్ కు ఏ స్థాయిలో పేరు తెస్తుందో చూడాలి. 



Updated Date - 2022-05-08T17:54:55+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!