Kashmir Criminals: ట్రైలర్ వదిలిన సంచలన దర్శకుడు
ABN, First Publish Date - 2022-06-15T01:53:48+05:30
‘రావణ లంక’ (Ravana Lanka) చిత్రంతో దర్శకుడిగా తన ప్రతిభను చాటిన బి.ఎన్.ఎస్. దర్శకత్వంలో.. అంజని క్రియేషన్స్, ఆరేటి క్రియేషన్స్, వడ్లపట్ల క్రియేషన్స్ బ్యానర్లపై జి.ఎ. రామారావు-హర్ష ఆరేటి-మోహన్ వడ్లపట్ల (యు.ఎస్.ఎ) సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘కశ్మీర్ క్రిమినల్స్’..
‘రావణ లంక’ (Ravana Lanka) చిత్రంతో దర్శకుడిగా తన ప్రతిభను చాటిన బి.ఎన్.ఎస్. దర్శకత్వంలో.. అంజని క్రియేషన్స్, ఆరేటి క్రియేషన్స్, వడ్లపట్ల క్రియేషన్స్ బ్యానర్లపై జి.ఎ. రామారావు-హర్ష ఆరేటి-మోహన్ వడ్లపట్ల (యు.ఎస్.ఎ) సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘కశ్మీర్ క్రిమినల్స్’ (Kashmir Criminals). నాగప్రసాద్ (Naga Prasad)-శివన్య (Sivanya) జంటగా నటించిన ఈ చిత్ర షూటింగ్ మొత్తం కశ్మీర్‌లోనే జరిగింది. మొత్తం షూటింగ్ కశ్మీర్లో జరుపుకున్న మొట్టమొదటి తెలుగు చిత్రం ఇదేనని మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్నట్లుగా మేకర్స్ వెల్లడించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ (The Kashmir Files) చిత్రం మాదిరిగానే.. ఇంటెన్స్ స్క్రీన్‌ప్లేతో రూపొందిన ఈ ‘కశ్మీర్ క్రిమినల్స్’ చిత్రం కూడా మంచి విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘సంచలనాలకు కేంద్ర బిందువు వంటి వర్మగారు మా చిత్ర ట్రైలర్‌ని విడుదల చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయనకు మా టీమ్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం. ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలపై మా టీమ్ దృష్టి పెట్టింది. ‘ది కశ్మీర్ ఫైల్స్’ ప్రేక్షకులను ఎలా అయితే అలరించిందో.. ఈ చిత్రం కూడా అలానే అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాము..’’ అని తెలిపారు.