Ram charan: వన్‌ అండ్‌ ఓన్లీ.. రాజమౌళి

ABN , First Publish Date - 2022-10-03T02:17:16+05:30 IST

‘వన్‌ అండ్‌ ఓన్లీ.. రాజమౌళి గారూ’ అంటూ మెగాపవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ ట్వీట్‌ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం లాస్‌ ఏంజెల్స్‌లో జరుగుతున్న బీయాండ్‌ ఫెస్ట్‌లో భాగంగా టీసీఎల్‌ ఛైనీస్‌ థియేటర్‌ (ఐమాక్స్‌)లో ప్రదర్శించారు.

Ram charan: వన్‌ అండ్‌ ఓన్లీ.. రాజమౌళి

‘వన్‌ అండ్‌ ఓన్లీ.. రాజమౌళి (Raja mouli)గారూ’ (Ond and only rajamouli)అంటూ మెగాపవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ram charan)ట్వీట్‌ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం లాస్‌ ఏంజెల్స్‌లో జరుగుతున్న బీయాండ్‌ ఫెస్ట్‌లో(Beyond Fest  భాగంగా టీసీఎల్‌ ఛైనీస్‌ థియేటర్‌ (ఐమాక్స్‌)లో ప్రదర్శించారు. అక్కడి ప్రేక్షకులతో కలిసి ఐమాక్స్‌ స్ర్కీన్‌పై తన చిత్రాన్ని చూసి మురిసిపోయారు జక్కన్న. థియేటర్‌లో సినిమాను వీక్షిస్తున్న ఫారిన్‌ ఆడియన్స్‌ ‘నాటు నాటు’ పాటకు డ్యాన్స్‌తో ఆడిటోరియంను హోరెత్తించారు. ఆ వీడియోను లాస్‌ ఏంజిల్స్‌ టైమ్స్‌ ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. సినిమా పూర్తయిన తర్వాత రాజమౌళి వేదికపై వెళ్లగా కరతాళ ధ్వనులతో ప్రేక్షకులు స్టాండింగ్‌ ఓవెషన్‌ ఇచ్చారు. ఆ వీడియోను మెగాపవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ ‘వన్‌ అండ్‌ ఓన్లీ.. ఎస్‌ఎస్‌ రాజమౌళి సర్‌’ అంటూ పోస్ట్‌ చేశారు. చరణ్‌ ట్వీట్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. 





Updated Date - 2022-10-03T02:17:16+05:30 IST

Read more