‘గని’.. చాలా గట్టిగా కొట్టేలా ఉన్నాడు: రామ్ చరణ్

ABN , First Publish Date - 2022-04-08T04:43:15+05:30 IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘గని’ చిత్రం విడుదల అవుతున్న సందర్భంగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా వైవిధ్యంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ‘చాలా గట్టిగా కొట్టేలా ఉన్నాడు’ అనే అర్థం వచ్చేలా.. ఒక మీమ్‌ని ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం రామ్ చరణ్ చేసిన

‘గని’.. చాలా గట్టిగా కొట్టేలా ఉన్నాడు: రామ్ చరణ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘గని’ చిత్రం విడుదల అవుతున్న సందర్భంగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా వైవిధ్యంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ‘చాలా గట్టిగా కొట్టేలా ఉన్నాడు’ అనే అర్థం వచ్చేలా.. ఒక మీమ్‌ని ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం రామ్ చరణ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అల్లు బాబీ కంపెనీ, రినైసాన్స్ పిక్చర్స్ సంయుక్తంగా.. కిరణ్ కొర్రపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం ‘గని’. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో.. అల్లు బాబీ, సిద్దు ముద్ద నిర్మించారు. ఈ చిత్రం ఏప్రిల్ 8న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ‘గని’ యూనిట్‌కు ఇండస్ట్రీ నుండి మంచి సపోర్ట్ లభిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి, రవితేజ, రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్ వంటి హీరోలు, నిర్మాణ సంస్థలు ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని కోరుతూ ట్వీట్స్ చేశారు. 


ఇక ‘గని’ టీమ్‌కి శుభాకాంక్షలు తెలుపుతూ రామ్ చరణ్ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. ఫస్ట్ టైమ్ ఒక మీమ్‌తో చరణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మీమ్‌లో ‘థే కాల్ హిమ్ గని.. ప్రత్యర్థికి చాలా గట్టిగా కాంపిటేషన్ ఇచ్చేలా ఉన్నాడు’ అంటూ ‘గని’ టైటిల్ సాంగ్‌ వినిపించారు. దీనికి స్పందించిన వరుణ్ తేజ్.. ‘‘హాహా.. లవ్ యు అన్న’’ అంటూ రిప్లయ్ ఇచ్చారు. దీనికి మెగాభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ.. ‘గని’ మంచి విజయం సాధించాలని కామెంట్స్ చేస్తున్నారు.  Updated Date - 2022-04-08T04:43:15+05:30 IST

Read more