సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Ram Charan: ఎన్టీఆర్‌కు స్పెషల్ బర్త్ డే విషెస్..

ABN, First Publish Date - 2022-05-20T17:09:06+05:30

ఈరోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) పుట్టినరోజు. ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తారక్‌ (Tarak)కు ప్రత్యేకంగా బర్త్ డే విషెస్‌ను తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈరోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) పుట్టినరోజు. ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తారక్‌ (Tarak)కు ప్రత్యేకంగా బర్త్ డే విషెస్‌ను తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీనిలో ..'సోదరుడు, సహ నటుడు, స్నేహితుడు.. నాకు తారక్ ఎవరో పదాలు నిర్వచించగలవని నేను అనుకోను. పుట్టినరోజు శుభాకాంక్షలు'..అని చరణ్ ట్వీట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాంతో ఈ ఇద్దరు హీరోల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


కాగా, ఎన్టీఆర్ (NTR) - రామ్ చరణ్ (Ram Charan) కలిసి నటించిన భారీ పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్ (RRR) ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా, తారక్ కొమురం భీమ్ పాత్రలో నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమాలో ఇద్దరు అన్నదమ్ములుగా నటించారు. ఈ సినిమా సమయంలో ఇద్దరం మంచి స్నేహితులమయ్యామని ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో చెప్పిన సంగతి తెలిసిందే. బయట కూడా చరణ్ - తారక్‌ల మధ్య మంచి బాండింగ్ ఉంది. ఆ బాండింగ్ ఎటువంటిదో మరోసారి చరణ్ ట్వీట్ రూపంలో తారక్ బర్త్ డే సందర్భంగా తెలియజేశారు. 


ఇక ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు, వెంకటేష్ దగ్గుబాటి, దర్శకుడు బుచ్చిబాబు, హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ సహా పలువురు సినీతారలు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్‌ను తెతెలిపారు.  












Updated Date - 2022-05-20T17:09:06+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!