Ram charan: స్టైలిష్‌ లుక్‌ అదిరింది!

ABN , First Publish Date - 2022-09-11T00:16:03+05:30 IST

‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో ప్యాన్‌ ఇండియా స్టార్‌గా గుర్తింపు పొందారు రామ్‌చరణ్‌. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో ఆర్‌సీ 15 వర్కింగ్‌ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది

Ram charan: స్టైలిష్‌ లుక్‌ అదిరింది!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’(RRR)తో ప్యాన్‌ ఇండియా స్టార్‌గా గుర్తింపు పొందారు రామ్‌చరణ్‌(Ram charan). ప్రస్తుతం శంకర్‌ (Shankar)దర్శకత్వంలో ఆర్‌సీ 15 వర్కింగ్‌ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. గురువారం రామ్‌చరణ్‌ తన సోదరీమణులు, స్నేహితుడు విక్కీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో ప్రయాణం చేసినట్లు ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. చరణ్‌ విహారానికి వెళ్లారనుకున్నారంతా. (Ram charan stylish look)


శనివారం ఆయన స్టైలిష్‌ ఫొటోలు షేర్‌ చేసి వర్క్‌ మోడ్‌ అని కామెంట్‌ చేశారు. దీనితో ఆయన షూటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫొటోలో గుబురు గడ్డంతో, నల్ల కళ్లజోడు పెట్టుకుని చరణ్‌ కనిపించారు. అయితే ఈ లుక్‌ శంకర్‌ సినిమాకు సంబంధించినదే అని టాక్‌ నడుస్తోంది. ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ సరసన కియారా అడ్వాణీ కథానాయికగా నటిస్తోంది. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీత దర్శకుడు. కీలక పాత్రల్లో సునీల్‌, అంజలి, శ్రీకాంత్‌, నవీన్‌ చంద్ర కనిపించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. 




Updated Date - 2022-09-11T00:16:03+05:30 IST