సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

రామ్ చరణ్ ఒక 'ఓ జి' Samantha కామెంట్స్ వైరల్..

ABN, First Publish Date - 2022-07-22T17:41:59+05:30

బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ సెలబ్రిటీ టాక్ షో 'కాఫీ విత్ కరణ్' (Koffee With Karan) 7వ సీజన్ మొదలైన సంగతి తెలిసిందే. ఈ షోలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు (Samantha Rauth Prabhu)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ సెలబ్రిటీ టాక్ షో 'కాఫీ విత్ కరణ్' (Koffee With Karan) 7వ సీజన్ మొదలైన సంగతి తెలిసిందే. ఈ షోలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు (Samantha Rauth Prabhu) పాల్గొన్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ (Akshay Kumar) ‏తో కలిసి సామ్ సందడి చేయగా..ఈ లేటెస్ట్ ఎపిసోడ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో గురువారం రాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో సామ్ తన కెరీర్ గురించి.. వ్యక్తిగత జీవితం.. పెళ్లి, విడాకులపై ఊహించని విధంగా స్పందించింది. 


దీనిలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) గురించి కీలక వ్యాఖ్యలు చేసింది సమంత. కరణ్ రాపిడ్ ఫైర్‌లో భాగంగా కొన్ని ప్రశ్నలకి ఒక్క మాటలో సమాధానం చెప్పాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ కి ఒక ఇంట్రెస్టింగ్ ట్యాగ్ ని ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తిగా మారింది. చరణ్ గురించి ఒక్క మాటలో చెప్పాలని కరణ్ అడుగగా..దానికి సమంత 'ఓ జి' అంటూ సమాధానం చెప్పింది. 


ఈ 'ఓ జి' అంటే చరణ్ ఒక 'ఒరిజినల్ గ్యాంగ్ స్టర్' అని అదిరిపోయే ట్యాగ్ ని చెప్పింది. దీనితో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. కాగా, చరణ్ - సమంత కలిసి 'రంగస్థలం' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఇక గత కొంత కాలంగా రంగస్థలం సినిమాకు సీక్వెల్ చేయాలనే ప్లాన్‌లో సుకుమార్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే ఈ సీక్వెల్‌లో కూడా చరణ్ సరసన సమంత నటిస్తుందో లేదో చూడాలి. ప్రస్తుతం వరుసగ ప్రాజెక్ట్స్‌తో చాలా బిజీగా ఉంది సామ్.

Updated Date - 2022-07-22T17:41:59+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!