సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Ram Charan - Lokesh: లైన్‌లో బాక్సాఫీస్ దాసోహమయ్యే సినిమా!

ABN, First Publish Date - 2022-07-22T00:11:03+05:30

‘విక్రమ్’ (Vikram).. లోకనాయకుడు, ఆండవర్ కమల్ హాసన్ (Kamal Haasan) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ. విక్రమ్ మూవీని ప్రేక్షకులు ఓన్ చేసుకోవడానికి, అందరూ కనెక్ట్ అవ్వడానికి మరో మెయిన్ రీజన్... మేకింగ్ అండ్ రైటింగ్. ఈ సినిమా చూసిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘విక్రమ్’ (Vikram).. లోకనాయకుడు, ఆండవర్ కమల్ హాసన్ (Kamal Haasan) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ. విక్రమ్ మూవీని ప్రేక్షకులు ఓన్ చేసుకోవడానికి, అందరూ కనెక్ట్ అవ్వడానికి మరో మెయిన్ రీజన్... మేకింగ్ అండ్ రైటింగ్. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ, ఇది డైరెక్టర్స్ మూవీ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఇది లోకేష్ సినిమ్యాటిక్ యూనివర్స్ అంటూ పొగిడేస్తున్నారు. ఆయన దర్శకత్వం వహించిన ‘విక్రమ్’, ‘ఖైదీ’ మూవీలు లింక్ అవ్వడంతో సౌత్ ఆడియన్స్ అందరి నోటా ఈ సినిమ్యాటిక్ యూనివర్స్ అనే మాట వినిపించడం మొదలైంది. దీంతో లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఎవరితో చేయబోతున్నాడు, మల్టివర్స్‌లో ఎవరెవరు జాయిన్ అవుతారు అనే చర్చలు.. ఇండస్ట్రీ అండ్ ఆడియన్స్‌లో స్టార్ట్ అయ్యాయి. ఈ టైంలో లోకేష్ తన లైనప్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కూడా ఉన్నాడు అనే స్టేట్మెంట్ ఇచ్చేశాడు. 


లోకేష్‌కు తన తాజా ఇంటర్వ్యూలో రామ్ చరణ్‌తో సినిమా అనే ప్రస్తావన వచ్చింది. చరణ్‌ని ఇప్పటికే రెండు మూడు సార్లు కలిసిన లోకేష్, తనకి ప్రస్తుతం ఉన్న రెండు మూడు సినిమాలు కంప్లీట్ అవ్వగానే చరణ్ సినిమాని సెట్స్ పైకి తీసుకోని వెళ్తాను అని చెప్పాడు. ఈలోపు చరణ్ కూడా తనకున్న కమిట్మెంట్స్ పూర్తి చేసుకుంటే, పాన్ ఇండియా సినిమాకి అంతా సెట్ అయినట్లే. ఇప్పటికే కొంతమంది ‘విక్రమ్’ మూవీలో కమల్ హాసన్ మనవడు, జూనియర్ ‘విక్రమ్’గా కనిపించిన బాబు, పెద్దయ్యాక రామ్ చరణ్ అవుతాడు అంటూ కొంతమంది సోషల్ మీడియాలో డిబేట్స్ చేస్తున్నారు. చరణ్‌ని కూడా తన యూనివర్స్‌లో భాగం చేస్తాడో లేదో తెలియదు కానీ.. ఒకవేళ లోకేష్ సినిమ్యాటిక్ యూనివర్స్‌లో మెగా పవర్ స్టార్ కూడా కలిస్తే... ఇండియన్ బాక్సాఫీస్ దాసోహం అవ్వడం ఖాయం.

Updated Date - 2022-07-22T00:11:03+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!