ఘనంగా ప్రారంభమైన Ram - boyapati చిత్రం

ABN , First Publish Date - 2022-06-01T21:13:53+05:30 IST

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram pothineni) ప్రస్తుతం లింగు సామి దర్శకత్వంలో ‘ది వారియర్’ (The warrior) అనే కాప్ థ్రిల్లర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా టాకీ పార్ట్ ఇటీవల పూర్తయింది. జూలై 14న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది.

ఘనంగా ప్రారంభమైన Ram - boyapati చిత్రం

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram pothineni) ప్రస్తుతం లింగు సామి దర్శకత్వంలో ‘ది వారియర్’ (The warrior) అనే కాప్ థ్రిల్లర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా టాకీ పార్ట్ ఇటీవల పూర్తయింది. జూలై 14న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. ఇక దీని తర్వాత రామ్ .. మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో యాక్షన్ మూవీ చేయబోతున్నాడు. రామ్ కెరీర్ లో 20వ చిత్రంగా విశేషాన్ని సంతరించుకుంది. గతేడాది ఓ సీనియర్ హీరోతో ‘అఖండ’ అనే చిత్రం తెరకెక్కించి బోయపాటి అఖండ విజయాన్ని సాధించిన నేపథ్యంలో రామ్ తో తీయబోయే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా నేడు (జూన్ 1) హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైంది. 


రామ్ - బోయపాటి చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ కెమేరా స్విచాన్ చేయగా.. మరో నిర్మాత స్రవంతి రవికిశోర్ మొదటి క్లాప్ కొట్టారు. దర్శకులు లింగుసామి, వెంకట్ ప్రభులు తమ చేతుల మీదుగా స్ర్కిప్ట్ ను అందించగా.. బోయపాటి ఫస్ట్ షాట్ ను డైరెక్ట్ చేశారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం విడుదల కానున్న ఈ సినిమా కోసం బోయపాటి ఒక అదిరిపోయే మాస్ కథాంశాన్ని వండారు. పూరీ జగన్నాథ్ (Puri Jagannath) ‘ఇస్మార్ట్ శంకర్’ (Ismart Shankar) చిత్రంతో మాస్ ఇమేజ్ తెచ్చుకున్న రామ్.. ఈ సినిమాతో మరోసారి యాక్షన్ హీరోగా రానుండడం విశేషంగా మారింది. మరి ఈ సినిమా కోసం రామ్ కు ఏ స్థాయిలో పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.  

Updated Date - 2022-06-01T21:13:53+05:30 IST

Read more