AR Rahman: ఏఆర్ రెహమాన్ వర్చువల్ రియాలిటీ చిత్రం.. వీక్షించిన సూపర్‌స్టార్

ABN , First Publish Date - 2022-12-01T20:01:35+05:30 IST

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ వర్చువల్ రియాలిటీలో లే మస్క్ అనే సినిమాని తీశారు. ఆ చిత్రాన్ని తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ వీక్షించారు...

AR Rahman: ఏఆర్ రెహమాన్ వర్చువల్ రియాలిటీ చిత్రం.. వీక్షించిన సూపర్‌స్టార్

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ వర్చువల్ రియాలిటీలో లే మస్క్ అనే సినిమాని తీశారు. ఆ చిత్రాన్ని తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ వీక్షించారు. దీనికి సంబంధించిన పిక్స్‌ని రెహమాన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆ పోస్ట్‌కి ‘లే మస్ట్ సినిమాని ఎవరు చూస్తున్నారో చెప్పుకొండి’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు.


అనంతరం రజనీకాంత్ కూతురు, ఫిల్మ్ మేకర్ ఐశ్వర్య కూడా తన తండ్రితో ఏఆర్ రెహమాన్‌తో ఉన్న పిక్‌ని షేర్ చేసింది. అందులో రెహమాన్ భుజాల మీద రజనీ చేతులు వేసి ఉన్నాడు. దానికి ‘ఇద్దరు అద్భుతమైన మానవులు కలుసుకోడానికి మీరు కారణం అయినప్పుడు.. చాలా ఆనంద పడతారు’ అని రాసుకొచ్చింది. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా.. ఐశ్వర్య, రెహమాన్ కలిసి ‘లాల్ సలామ్’ అనే సినిమాకి పని చేస్తున్నారు. అలాగే.. రజనీ ప్రస్తుతం నెల్సన్ దీలిప్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ అనే సినిమా చేస్తున్నాడు.







Updated Date - 2022-12-01T20:01:35+05:30 IST