సెట్స్‌పైకి రజనీకాంత్‌ జైలర్‌

ABN , First Publish Date - 2022-08-23T05:47:23+05:30 IST

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ‘జైలర్‌’ అవతారమెత్తారు. యంగ్‌ డైరెక్టర్‌ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌...

సెట్స్‌పైకి రజనీకాంత్‌ జైలర్‌

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ‘జైలర్‌’ అవతారమెత్తారు. యంగ్‌ డైరెక్టర్‌ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ సోమవారం చెన్నైలో సంప్రదాయ పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌లో నిర్మాత కళానిధి మారన్‌ నిర్మించే ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో రజనీకాంత్‌ కళ్ళ అద్దాలు ధరించి, చేతులు రెండు వెనుక పెట్టుకుని గంభీరంగా నడిచివస్తూ విభిన్నమైన లుక్‌లో కనిపిస్తున్నారు. జైలు చుట్టూ తిరిగే కథలో రజనీ జైలర్‌గా నటించనున్నారు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం. అయితే, ఇందులో నటించే ఇతర నటీనటుల, పనిచేసే సాంకేతిక నిపుణుల వివరాలను బహిర్గతం చేయకపోయినప్పటికీ ఇందులో హీరోయిన్‌గా మిల్కీబ్యూటీ తమన్నా నటించనున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది.  


Updated Date - 2022-08-23T05:47:23+05:30 IST