‘సత్యం’ రాజేశ్ హీరోగా...
ABN , First Publish Date - 2022-12-23T04:30:45+05:30 IST
‘సత్యం’ రాజేశ్ కథానాయకుడిగా మధుసూధన్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. రిహ, సునీత కథానాయికలు...

‘సత్యం’ రాజేశ్ కథానాయకుడిగా మధుసూధన్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. రిహ, సునీత కథానాయికలు. గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. దర్శకుడు మాట్లాడుతూ ‘‘చక్కటి కథ, కథనాలతో, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకొనేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తాం. భీమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నార’’న్నారు.