మీ ఆశీస్సుల వల్లే బ్రతికున్నా: రాజశేఖర్

ABN , First Publish Date - 2022-02-05T00:33:21+05:30 IST

కోవిడ్‌కి గురైనప్పుడు.. అసలు నేను బతుకుతానా లేదా అనిపించింది. ఇక నా జీవితం అయిపోయింది.. నేను సినిమాలు చేస్తానా? లేదా?.. అనుకున్నాను. ఎందుకంటే నేను హాస్పిటల్లో లేవలేక, నడవలేక చాలా ధీన స్థితికి వెళ్లిపోయాను. అయితే ఈ రోజు

మీ ఆశీస్సుల వల్లే బ్రతికున్నా: రాజశేఖర్

యాంగ్రీ హీరో రాజశేఖర్ నటించిన 91వ సినిమా ‘శేఖర్’. జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో.. పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఈ చిత్రంలోని ‘కిన్నెర’ సాంగ్‌ను విడుదల చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


సాంగ్ విడుదల సందర్భంగా హీరో రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘‘కోవిడ్‌కి గురైనప్పుడు.. అసలు నేను బతుకుతానా లేదా అనిపించింది. ఇక నా జీవితం అయిపోయింది.. నేను సినిమాలు చేస్తానా? లేదా?.. అనుకున్నాను. ఎందుకంటే నేను హాస్పిటల్లో లేవలేక, నడవలేక చాలా ధీన స్థితికి వెళ్లిపోయాను. అయితే ఈ రోజు నేను మీ ముందు నిలుచున్నాను అంటే.. దానికి కారణం ప్రేక్షకుల ఆశీర్వాదమే. ఈ సందర్భంగా ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. నేను కోలుకున్న తర్వాత ఈ ‘శేఖర్’ సినిమా చేయడం జరిగింది. ఈ సినిమాకు నేను ఎంత కష్టపడ్డానంటే.. 10 సినిమాలు చేసినంత వర్క్ ఈ సినిమాకు చేశా. టీమ్ అంతా ఈ సినిమాని ప్రాణం పెట్టి తీశాము. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం జీవిత. తను మా వెనకుండి నడిపించింది. దాని ఫలితం ఈ సినిమాలో కనిపిస్తుంది. అందరూ ఈ సినిమా చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను..’’ అన్నారు.



Updated Date - 2022-02-05T00:33:21+05:30 IST