సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Rajinikanth: రజనీయిజానికి 47 వసంతాలు

ABN, First Publish Date - 2022-08-17T13:53:39+05:30

కోలీవుడ్‌లో మూడు తరాల తర్వాత కూడా అగ్రనటుడిగా కొనసాగుతున్న సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Rajinikanth) సినీ కెరీర్‌కు 47 వసంతాలు. అందు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడయార్‌(చెన్నై), ఆగస్టు 16: కోలీవుడ్‌లో మూడు తరాల తర్వాత కూడా అగ్రనటుడిగా కొనసాగుతున్న సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Rajinikanth) సినీ కెరీర్‌కు 47 వసంతాలు. అందుకే ఆయన కుమార్తె సౌందర్య ‘47 రజీనీయిజం’ పేరుతో అభినందనలు తెలిపారు. 1975, ఆగస్టు 15న కె.బాలచందర్‌ దర్శకత్వంలో విడుదలైన ‘అపూర్వ రాగంగల్‌’ అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన శివాజీరావ్‌ అలియాస్‌ రజనీకాంత్‌.. ప్రారంభంలో విలన్‌, క్యారెక్టర్‌ పాత్రల్లో కనిపించారు. ఆ తర్వాత ఆయన దక్షిణాది సూపర్‌స్టార్‌(Superstar)గా అవతరించారు. ఈ క్రమంలో ఆయన చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి 47 యేళ్ళు పూర్తయిన సందర్భంగా అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రజనీకి ఆయన సతీమణి లత(Wife is Lata) పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ ఫొటోలను రజనీ రెండో కుమార్తె సౌందర్య సోషల్‌ మీడియాలో విడుదల చేశారు. ‘మాటల్లో వర్ణించలేని ఒక భావోద్వేగం మీరు. మా కుటుంబంలో సూపర్‌స్టార్‌’ అని ట్వీట్‌ చేశారు.



Updated Date - 2022-08-17T13:53:39+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!