తారక్‌–చరణ్‌లకు జక్కన్న కొత్త పేర్లు!

ABN , First Publish Date - 2022-03-17T23:19:35+05:30 IST

తారక్‌.. సూపర్‌ కంప్యూటర్‌... చరణ్‌.. క్లీన్‌ వైట్‌ కాన్వాస్‌.. అగ్రహీరోలు ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ గురించి దర్శకధీరుడు రాజమౌళి చెప్పిన మాటలివి. అసలు వీరిద్దరి గురించి ఎందుకిలా చెప్పారు? ప్రత్యేకంగా వారితో ఉన్న అనుభవాలేంటి? ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్య్వూలో రాజమౌళి ఏం చెప్పారు?

తారక్‌–చరణ్‌లకు జక్కన్న కొత్త పేర్లు!

తారక్‌.. సూపర్‌ కంప్యూటర్‌... 

చరణ్‌..  క్లీన్‌ వైట్‌ కాన్వాస్‌.. 


అగ్రహీరోలు ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ గురించి దర్శకధీరుడు రాజమౌళి చెప్పిన మాటలివి. 

అసలు వీరిద్దరి గురించి ఎందుకిలా చెప్పారు? ప్రత్యేకంగా వారితో ఉన్న అనుభవాలేంటి? 

ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్య్వూలో రాజమౌళి ఏం చెప్పారు? 

రాజమౌళి దర్శకుడిగా ప్యాన్‌ ఇండియా స్థాయిలో తారక్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. దానయ్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఒకప్పటికీ, ఇప్పటికీ ఈ హీరోలిద్దరిలో తేడాను బయటపెట్టారు రాజమౌళి. ఆ ఆసక్తికర విషయాలు... 




ఎన్టీఆర్‌ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే అతనొక సూపర్‌ కంప్యూటర్‌ లాంటోడు.  నేను ఒక్క లైన్‌ చెప్పానంటే దానిని తను రెండు, మూడు రకాలుగా ఊహించుకుని ‘ఎలా నటించాలి? ఏం చేయాలి?’ అని డిసైడ్‌అ య్యి సీన్‌కి ఏం కావాలో అది చేస్తాడు. అదొక వర్కింగ్‌ స్టైల్‌. మనం ఒక లైన్‌ రాసుకుంటే... ఒక్క పాజ్‌ ఇస్తాడని, సన్నివేశానికి తగ్గట్లు ఎలా నటిస్తాడనేది నాకు తెలుసు. నేను ఊహించుకున్నది, నాకు కావలసింది.. యాజ్‌ ఇట్‌ ఈజ్‌ చేసేస్తాడు. 


ఇక రామ్‌చరణ్‌.. తనతో కంప్లీట్‌ డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఉంటుంది. క్యారెక్టర్‌ ఏంటి? ఎలా నటించాలి? అనేది చరణ్‌కు తెలుసు. షూటింగ్‌కు క్లీన్‌ వైట్‌ కాన్వాస్‌లా వస్తాడు. ‘ఆ కాన్వాస్‌ మీద ఏ పెయింటింగ్‌ కావాలంటే ఆ పెయింటింగ్‌ వేసుకోండి’ అన్నట్టు ఉంటాడు అది నాకు చాలా కష్టంగా ఉంటుంది(నవ్వుతూ). పాత్ర గురించి అంతా తెలిసినప్పుడు... అదంతా మైండ్‌లో  తీేససి ‘ఏం తెలియదు. నేను తెల్ల కాగితంలా మీ దగ్గరకు వచ్చాను’ అన్నట్టు ఉంటే... నాకు చాలా విచిత్రంగా అనిపించేది. ఇంతకుముందు చరణ్‌ ఇలా ఉండేవాడు కాదు. అదంటా మెడిటేషన్‌ మాయ అనుకుంటాను’’ అని రాజమౌళి చెప్పారు. 


Updated Date - 2022-03-17T23:19:35+05:30 IST