‘రాజమండ్రి రోజ్ మిల్క్’: కాలేజ్ డేస్ గుర్తు చేస్తుందట!

ABN , First Publish Date - 2022-04-03T00:38:11+05:30 IST

కొత్తదనం నిండిన చిత్రాలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారనే విషయం ఇప్పటికే పలుమార్లు నిరూపితమైంది. చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అనే తేడా లేకుండా.. రొటిన్ ఫార్ములాను బ్రేక్ చేస్తూ వచ్చే వైవిధ్యమైన

‘రాజమండ్రి రోజ్ మిల్క్’: కాలేజ్ డేస్ గుర్తు చేస్తుందట!

కొత్తదనం నిండిన చిత్రాలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారనే విషయం ఇప్పటికే పలుమార్లు నిరూపితమైంది. చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అనే తేడా లేకుండా.. రొటిన్ ఫార్ములాను బ్రేక్ చేస్తూ వచ్చే వైవిధ్యమైన చిత్రాలకు ప్రేక్షకులు పెద్దపీట వేస్తుంటారు. ఇప్పుడు అలాంటి కోవకే మా చిత్రం చెందుతుంది అంటున్నారు ‘రాజమండ్రి రోజ్ మిల్క్’ చిత్ర టీమ్. ఉగాది సందర్భంగా ఈ చిత్ర టైటిల్ పోస్టర్‌ను శనివారం చిత్రయూనిట్ విడుదల చేసింది. నాని బండ్రెడ్డి దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్, ఇంట్రూప్ నిర్మాణ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి డి.సురేష్‌బాబు, ప్రదీప్ ఉప్పలపాటి నిర్మాతలు.


జై జాస్తి, అవంతిక ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రంలో హాస్య నటులు వెన్నెల కిషోర్, ప్రవీణ్‌ కీలకపాత్రలలో నటిస్తున్నారు. వీరితో పాటు ధరహాస్, వెంకట్‌ గణేష్, హేమంత్ మధుమణి, ప్రీతినిగమ్‌లు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం రాజమండ్రిలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్ర విశేషాలను దర్శకుడు నాని బండ్రెడ్డి తెలియజేస్తూ.. ఇటీవల చిత్రీకరణ ప్రారంభించాం. పూర్తి వినోదాత్మకంగా, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుంది. అందరికి ఈ చిత్రం కాలేజీ రోజులను గుర్తు చేస్తుంది. కాలేజీ రోజుల్లో జరిగిన మరపురాని సంఘటనలను ఈ చిత్రం జ్ఞప్తికి తెస్తుంది.. అని అన్నారు.

Updated Date - 2022-04-03T00:38:11+05:30 IST

Read more