Sukumar వదిలిన ‘రాజమండ్రి రోజ్ మిల్క్’ ఫస్ట్‌ లుక్

ABN, First Publish Date - 2022-05-29T02:06:22+05:30

నాని బండ్రెడ్డి (Naani Bandreddi) దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్‌ (Suresh Productions)తో కలిసి ఇంట్రూప్ ఫిల్మ్స్ (Introupe Films) సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘రాజమండ్రి రోజ్ మిల్క్’ (Rajahmundry Rose Milk). జై జాస్తి (Jai Jasti), అనంతిక

Sukumar వదిలిన ‘రాజమండ్రి రోజ్ మిల్క్’ ఫస్ట్‌ లుక్
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాని బండ్రెడ్డి (Naani Bandreddi) దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్‌ (Suresh Productions)తో కలిసి ఇంట్రూప్ ఫిల్మ్స్ (Introupe Films) సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘రాజమండ్రి రోజ్ మిల్క్’ (Rajahmundry Rose Milk). జై జాస్తి (Jai Jasti), అనంతిక (Ananthika) హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, ప్రవీణ్, ప్రణీత పట్నాయక్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. డి.సురేష్‌బాబు (D Suresh Babu), ప్రదీప్ ఉప్పలపాటి (Pradeep Uppalapati) నిర్మాతలు. ఇప్పటి వరకు ఈ చిత్రంలో నటించే నూతన హీరోహీరోయిన్ల ప్రచార చిత్రాలను గోప్యంగా ఉంచిన చిత్ర బృందం.. శనివారం వారిని రివీల్ చేస్తూ.. ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ (Sukumar) శనివారం సాయంత్రం తన సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సినిమా పేరుకు తగ్గట్టే.. ఫస్ట్ లుక్ కూల్‌గా ఉందని.. సినిమా మంచి విజయం సాధించాలని కోరుతున్నట్లుగా తెలిపారు. 


ఈ సందర్భంగా దర్శకుడు నాని చిత్ర విశేషాలను తెలియజేస్తూ..  పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ అందరికీ  కాలేజీ రోజులను గుర్తుచేస్తుంది. కాలేజీ రోజుల్లో జరిగిన మరపురాని సంఘటనలను ఈ చిత్రం జ్ఞప్తికి తెస్తుంది. ఫస్ట్ లుక్ విడుదల చేసిన మా టీమ్‌కి ఎంతో ఇష్టమైన దర్శకుడు సుకుమార్ గారికి ధన్యవాదాలు..’’ అని తెలుపగా..  నిర్మాతలు మాట్లాడుతూ..  జూన్ 10 నుంచి రెండవ షెడ్యూల్‌ను రాజమ్రండి, వైజాగ్‌లో చిత్రీకరిస్తాం. సెప్టెంబరులో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. 



Updated Date - 2022-05-29T02:06:22+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!