Rahul ramakrishna: లిప్‌లాక్‌తో కాబోయే భార్యను పరిచయం చేసిన రాహుల్‌ రామకృష్ణ

ABN , First Publish Date - 2022-05-08T22:40:23+05:30 IST

హాస్యనటుడు, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ రాహుల్‌ రామకృష్ణ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. రాహుల్‌కు కాబోయే భార్య పేరు బింధు. అంతకుమించి ఆమె వివరాలు ఏమీ రాహుల్‌ వెల్లడిచలేదు. లిప్‌లాక్‌ ఇస్తున్న ఫొటో షేర్‌ చేసి త్వరలోనే పెళ్లి అంటూ ప్రకటించారు.

Rahul ramakrishna: లిప్‌లాక్‌తో కాబోయే భార్యను పరిచయం చేసిన రాహుల్‌ రామకృష్ణ

హాస్యనటుడు, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ రాహుల్‌ రామకృష్ణ (Rahul ramakrishna)త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. రాహుల్‌కు కాబోయే భార్య పేరు బింధు. అంతకుమించి ఆమె వివరాలు ఏమీ రాహుల్‌ వెల్లడిచలేదు. లిప్‌లాక్‌ ఇస్తున్న ఫొటో షేర్‌ చేసి త్వరలోనే పెళ్లి అంటూ ప్రకటించారు. 


ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటో చూసిన నెటిజన్లు ‘అర్జున్‌ రెడ్డి స్టైల్‌లో చెప్పావు. అసలైన జాతిరత్నానివి నువ్వు’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ‘అర్జున్‌ రెడ్డి’, ‘గీత గోవిందం’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన ‘భరత్‌ అనే నేను’(Bharath ane nenu), ‘బ్రోచేవారెవరురా’, ‘అల వైకుంఠపురములో’(Ala vaikuntapuramulo), ‘జాతిరత్నాలు’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌(RRR)’ చిత్రాలతో నటుడిగా మరో మెట్టు ఎక్కారు. తాజాగా ఆయన నటించిన ‘కృష్ణ వ్రింద విహారి’, ‘విరాటపర్వం’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. 




Updated Date - 2022-05-08T22:40:23+05:30 IST

Read more