Rahasya: ఆసక్తికరంగా ‘రహస్య’ ఫస్ట్ లుక్
ABN , First Publish Date - 2022-08-12T02:10:37+05:30 IST
కంటెంట్‌లో విషయం ఉంటే.. అది చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అని ప్రేక్షకులు ఆలోచించకుండా విజయాన్ని ఇస్తున్నారు. అందుకు ఉదాహరణ తాజాగా విడుదలైన ‘సీతా రామం’..
కంటెంట్‌లో విషయం ఉంటే.. అది చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అని ప్రేక్షకులు ఆలోచించకుండా విజయాన్ని ఇస్తున్నారు. అందుకు ఉదాహరణ తాజాగా విడుదలైన ‘సీతా రామం’ (Sita Ramam), ‘బింబిసార’ (Bimbisara) చిత్రాలే. ఇప్పుడలాంటి కంటెంట్‌తోనే వస్తున్నామని అంటున్నారు నిర్మాత గౌతమ్ ఎస్. SSS ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నివాస్ శిస్ట్, సారా ఆచార్ జంటగా.. శివ శ్రీ మీగడ (Shiva Sri Meegada) దర్శకత్వంలో గౌతమి.S (Gautami S) నిర్మిస్తున్న చిత్రం ‘రహస్య’ (Rahasya). తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు.
ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ‘‘గతంలో ఎన్నడూ చూడని డిఫరెంట్ కంటెంట్‌తో కథ సిద్ధం చేసి.. ఈ సినిమాను రూపొందిస్తున్నాం. మనిషికి, మంచానికి ఉండే సంబంధాన్ని డిఫరెంట్ వే లో ప్రెజెంట్ చేయబోతున్నాం. సర్వ హంగులతో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేశాం. కంటెంట్‌కి తగ్గ లొకేషన్స్‌లో సినిమాను షూట్ చేశాం. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన అనుభూతి కలిగించాలని టార్గెట్‌గా పెట్టుకున్నాం. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్‌తోనే ఆ విషయం ప్రేక్షకులకు అర్థమై ఉంటుందనుకుంటున్నాం. అతిత్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తాం..’’ అని అన్నారు. కాగా, మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందిస్తుండగా.. సునీల్ కశ్యప్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. (Rahasya First Look)