సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘బడవ రాస్కెల్’గా రాబోతోన్న ‘పుష్ప’ జాలిరెడ్డి

ABN, First Publish Date - 2022-01-30T00:18:48+05:30

‘పుష్ప’ సినిమాలో జాలిరెడ్డిగా చేసిన ధనుంజయ్ హీరోగా, అమృత అయ్యంగార్ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘బడవ రాస్కెల్’. కన్నడ‌లో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో విడుదలకు సిద్ధమవుతుంది. డాలీ పిక్చర్స్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘పుష్ప’ సినిమాలో జాలిరెడ్డిగా చేసిన ధనుంజయ్ హీరోగా, అమృత అయ్యంగార్ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘బడవ రాస్కెల్’. కన్నడ‌లో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో విడుదలకు సిద్ధమవుతుంది. డాలీ పిక్చర్స్ మరియు రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.


పలు విజయవంతమైన సినిమాలను చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్న రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండటంతో.. తెలుగులో కూడా ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనేలా టాక్ మొదలైంది. కాగా, శ్రీమతి గీత శివరాజ్ కుమార్ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీమతి సావిత్రమ్మ అడవి స్వామి నిర్మించారు. శంకర్ గురు దర్శకత్వం వహించారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన విడుదల వివరాలను వెల్లడించనున్నారు.

Updated Date - 2022-01-30T00:18:48+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!