Prabhasతో పూరి 'ఒక్క అడుగు'..?

ABN , First Publish Date - 2022-06-16T19:02:45+05:30 IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియన్ సినిమాలతో బిజీ గా ఉన్నారు. ప్రభాస్ హీరోగా రెబల్ స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju) 'ఒక్క అడుగు' (Okka Adugu)

Prabhasతో పూరి 'ఒక్క అడుగు'..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియన్ సినిమాలతో బిజీ గా ఉన్నారు. ప్రభాస్ హీరోగా రెబల్ స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju) 'ఒక్క అడుగు' (Okka Adugu) సినిమాని ప్రతిష్టాత్మకంగా తన సొంత బ్యానర్ అయిన గోపీకృష్ణ మూవీస్‌పై నిర్మించాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. 'బాహుబలి' సినిమా కన్నా ముందునుంచే ఈ ప్రాజెక్ట్ గురించి రెబల్ స్టార్ ఫాన్స్ లో చర్చ జరుగుతూనే ఉంది. బాహుబలి అయిపోయి ఏళ్లు గడుస్తున్నా కానీ 'ఒక్క అడుగు' ప్రాజెక్ట్ ఇప్పటివరకూ పట్టాలెక్కింది లేదు. ప్రభాస్ వేరు వేరు సినిమాలకు కాల్షీట్లు కేటాయిస్తున్నాడు తప్ప.. పెదనాన్న రాసిన సినిమాకి మాత్రం కేటాయంచట్లేదు.


నాలుగేళ్ల క్రితం కృష్ణంరాజు ఈ ప్రాజెక్ట్ డీటైల్స్ వెల్లడించారు. ప్రభాస్ కటౌట్‌కు అదిరిపోయే స్క్రిప్ట్ అని...ఒక మంచి మెసేజ్‌తో కూడుకున్న సినిమా అవుతుందని...'ఒక్క అడుగు'.. ప్రభాస్ వెయ్యి అడుగుల వేసేలా ఇన్‌స్పైర్ చేసే స్క్రిప్ట్ అని చెప్పారు. కృష్ణం రాజు స్వయంగా ఈ కథను సిద్దం చేసుకున్నట్లు కూడా వెల్లడించారు. మీరే డైరెక్ట్ చేయోచ్చు కదా..అని ప్రశ్నించగా? అది నేను చేయాల్సిన సినిమా కాదు...పూరి జగన్నాథ్ (Puri Jagannath) లాంటి వాళ్లు చేయాల్సిన పవర్ పుల్ స్క్రిప్ట్.. అని పూరి పేరు రివీల్ చేసారు రెబల్ స్టార్. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఎనిమిది సినిమాలు ఉన్నాయి. సో ఇప్పట్లో ఒక్క అడుగు మాట కూడా వినిపించడం కష్టం అనుకుంటున్న టైములో షాకింగ్ న్యూస్ బయటకి వచ్చింది. 'ఒక్క అడుగు' సినిమా గురించి మరోసారి కృష్ణంరాజు ప్రభాస్ వద్ద చర్చించారట. 


అందుకు ప్రభాస్ తప్పకుండా చేద్దామని పెదనాన్నకి ప్రామిస్ చేసినట్లు సమాచారం. పూరి, డార్లింగ్ ర్యాపో గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ  ప్రాజెక్ట్‌ను పూరి టేకప్ చేసి పాన్ ఇండియన్ లెవెల్‌లో తెరకేకించిన ఆశ్చర్యం లేదు. అయితే 'టెంపర్' మినహా, పూరి ఇప్పటివరకు ఇతర రైటర్ల కథల్ని తీసుకున్న సందర్భం లేదు. రీమేక్‌లు కూడా చాలా అరుదు. అయితే, ఇక్కడ కథ రాసింది రెబల్ స్టార్, యాక్ట్ చేయనుంది యంగ్ రెబల్ స్టార్.. కాబట్టి పూరి టేకప్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక పూరి - ప్రభాస్ కాంబినేషన్‌లో ఇంతకముందు 'ఏక్ నిరంజన్', 'బుజ్జిగాడు' చిత్రాలొచ్చిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2022-06-16T19:02:45+05:30 IST