సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Puri Jagannath: మీరందరూ ఒక్కొక్క టికెట్ కొనండ్రా బాబు..మా సినిమా బ్లాక్ బస్టర్

ABN, First Publish Date - 2022-08-21T18:46:17+05:30

‘మీరందరూ ఒక్కొక్క టికెట్ కొనండ్రా బాబు..మా సినిమా బ్లాక్ బస్టర్’ అని డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannath) తాజాగా నిర్వహించిన లైగర్ (Liger) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘మీరందరూ ఒక్కొక్క టికెట్ కొనండ్రా బాబు..మా సినిమా బ్లాక్ బస్టర్’ అని డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannath) తాజాగా నిర్వహించిన లైగర్ (Liger) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అన్నారు. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), అనన్య పాండే (Ananya Pandey) జంటగా నటించిన సినిమా ఇది. రమ్యకృష్ణ, మైక్ టైసన్, మకరంద్ దేశ్‌పాండే కీలక పాత్రల్లో నటించారు. ఈ నెల 25వ తేదీన భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గుంటూరులో నిర్వహించారు.


ఈ సందర్భంగా దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ, ‘మీ అందరినీ చూస్తుంటే సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చామా? లేదంటే సినిమా రిలీజైపోయి సక్సెస్ టూర్‌కి వచ్చామా? అనేది అర్థం కావడం లేదు. మీరందరూ ఒక్కక్క టిక్కెట్ కొనండ్రా బాబూ.. మా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. విజయ్ ఫ్యాన్స్‌లో అబ్బాయిల కంటే అమ్మాయిలు డబుల్ ఉన్నారు. విజయ్ ఈ సినిమాలో ఇరగదీశాడు.. అనన్య చింపేసింది. రమ్యకృష్ణ ఊరుకుంటారా? ఆవిడ కూడా ఉతికి ఆరేశారు. ఇక ఈ సినిమాలో హైలైట్ మైక్ టైసన్. 


మైక్ టైసన్ లెజెండ్..ఆయన్ని కొట్టే మొనగాడు ప్రపంచంలో ఎవడూ లేడు. మైక్ టైసన్ ను కొట్టిన తరువాత ఆ పైన కొట్టడానికి ఇక ఎవడూ లేడు. అలాంటి మనిషి మా సినిమాలో చేశారు. మొన్న ముంబై వెళ్లినప్పుడు ఒక జర్నలిస్ట్.. మైక్ టైసన్ ఎవరన్నా? అని అడిగాడు. చాలా హర్ట్ అయ్యాను. ఇంతకష్టపడి మైక్ టైసస్‌ను తీసుకుని వస్తే ఆయనను ఎవరని అడుగుతున్నారేంటబ్బా.. అనుకున్నాను.


అందుకే, మైక్ టైసన్ గురించి ఒకసారి తెలుసుకుని థియేటర్ కి వెళ్లండి. ఆయన చాలా గ్రేట్ పర్సన్. మీరు బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు.. ఎంత కలెక్ట్ చేస్తుందో తెలియదు. అవన్నీ పక్కన పెట్టి ఇంతకంటే డబుల్ బడ్జెట్‌తో 'జనగణ మన' సినిమా ఆల్రెడీ ఆ సినిమాకి సంబంధించిన ఒక షెడ్యూల్ షూటింగును కూడా పూర్తి చేశాము’..అని చెప్పారు.

Updated Date - 2022-08-21T18:46:17+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!