Mahesh Babu: మహేష్ సినిమా ఆదిలోనే హంసపాదు, చినబాబు కి కోట్లలో నష్టం

ABN , First Publish Date - 2022-09-24T20:22:01+05:30 IST

మహేష్ బాబు (Mahesh Babu) మరియు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్ (Combination)లో వస్తున్న సినిమా షూటింగ్ ఆర్భాటంగానే మొదలు పెట్టారు.

Mahesh Babu: మహేష్ సినిమా ఆదిలోనే హంసపాదు, చినబాబు కి కోట్లలో నష్టం

మహేష్ బాబు (Mahesh Babu) మరియు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్ (Combination)లో వస్తున్న సినిమా షూటింగ్ ఆర్భాటంగానే మొదలు పెట్టారు. సాంఘీక మాధ్యమాల్లో (Social media) మహేష్ లుక్ (Mahesh Look) ఆ సినిమాలో పనిచేస్తున్న కొందరు ఒక్కొక్కరు ఒక్కో మహేష్ ఫోటో పెట్టడమే కాకుండా, ఒక చిన్న వీడియో కూడా ప్రొడక్షన్ హౌస్ విడుదల చేసింది. ఇంత హంగామా తో మొదలెట్టిన సినిమా, ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా ఓ ఆరు రోజులు చేసి ఆగింది. దీని గురించి పరిశ్రమలో వివిధ రకాలుగా అనుకున్నారు, షూటింగ్ షెడ్యూల్ అయిందా, లేక ఆగిపోయిందా అని? మహేష్ బాబు కి ఆ పోరాట సన్నివేశాలు కొరియోగ్రాఫ్ (Action Choregraphers) చేసే యాక్షన్ దర్శకులు ఇద్దరు అంబు మరియు అన్వి (AmbuAnvi) తో మహేష్ కి ఏవో విభేదాలు (Differences) రావటం తో ఆగిపోయిందని కూడా ఒక వార్త చక్కర్లు కొడుతోంది. 


ఒకవేళ అదే నిజమయితే ఈ యాక్షన్ సన్నివేశం అంతా మళ్ళీ రీషూట్ చెయ్యాలి, వీలతోనా, లేక వేరే వాళ్ళతోనే అన్నది ముందు ముందు తెలుస్తుంది. ఇప్పుడు ఈ ఆరు రోజులు చేసిన వర్క్ అంత వేస్ట్ అయ్యే ఛాన్స్ వుంది, ఆలా అయితే నిర్మాత చినబాబు (Producer Chinababu) కి కోట్లలో (Crores of rupees) నష్టం వచ్చినట్టే కదా. పెద్ద స్టార్ సినిమా అంటే ఎలా లేదన్న రోజుకి ఒక 50 లక్షల నుండి కోటి రూపాయలు (50 lakhs to one crore) వరకు ఖర్చు అవుతుందని అంచనా. మరి ఈ లెక్కన చినబాబుకు ఆదిలోనే ఇంత డబ్బు పోతే ఇక ముందు ముందు ఎలా ఉంటుందో!

Updated Date - 2022-09-24T20:22:01+05:30 IST