సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఇండస్ట్రీలో ఎల్ఎల్‌పి అనే క్యాన్సర్ స్టార్ట్ అయ్యింది: చదలవాడ శ్రీనివాసరావు

ABN, First Publish Date - 2022-07-04T19:26:58+05:30

రఘు కుంచె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మా నాన్న నక్సలైట్’. అజయ్, జీవా, సుబ్బరాజు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను చదలవాడ బ్రదర్స్ సమర్ఫణలో అనురాధ ఫిల్మ్స్ డివిజన్ పతాకంపై చదలవాడ శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రఘు కుంచె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మా నాన్న నక్సలైట్’. అజయ్, జీవా, సుబ్బరాజు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను చదలవాడ బ్రదర్స్ సమర్ఫణలో అనురాధ ఫిల్మ్స్ డివిజన్ పతాకంపై చదలవాడ శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. 90ల్లో జరిగిన కథతో ఈ సినిమాను సునీల్ కుమార్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఇటీవల జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు చిన్న సినిమా మనుగడపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ..  


‘చిన్న సినిమా మనుగడ కరువైంది. సినిమా ఇండస్ట్రీ లో ఎల్ఎల్‌పి అనే క్యాన్సర్ స్టార్ట్ అయ్యింది. చిన్న సినిమాలకి యాడ్స్ ఇవ్వాలన్నా వాళ్ళకి కమీషన్ ఇవ్వాలి. ఎల్ఎల్ పి అంటే మా సాటి నిర్మాతలే. ఒక నిర్మాత సినిమా తీస్తే ఇంకో నిర్మాత కి కమీషన్ ఇవ్వటం ప్రపంచంలో ఎక్కడ ఉండదు. సినిమా ఇండస్ట్రీ లో ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఈ రెండే వెల్ విషేర్స్. మొన్న సమ్మె విషయం కూడా ఛాంబర్ ద్వారా రెండు గంటల్లో  సమస్య పరిష్కారం అయింది’. అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-07-04T19:26:58+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!