సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Pushpa 2: పుష్ప 2 లో ప్రియాంక చోప్రా ఐటెం సాంగ్?

ABN, First Publish Date - 2022-09-27T22:32:06+05:30

అల్లు అర్జున్ (Allu Arjun) మరియు దర్శకుడు సుకుమార్ (Sukumar) కాంబినేషన్ లో వస్తున్న పుష్ప 2 (Pushpa 2) భారీ బడ్జెట్ (HIgh Budgdet movie) సినిమాగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి అన్ని హంగులు పెట్టి అంతర్జాతీయంగా విడుదల (International release) చెయ్యాలని ఈ సినిమా నిర్మాతలు భావిస్తున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అల్లు అర్జున్ (Allu Arjun) మరియు దర్శకుడు సుకుమార్ (Sukumar) కాంబినేషన్ లో వస్తున్న పుష్ప 2 (Pushpa 2) భారీ బడ్జెట్ (HIgh Budgdet movie) సినిమాగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి అన్ని హంగులు పెట్టి అంతర్జాతీయంగా విడుదల (International release) చెయ్యాలని ఈ సినిమా నిర్మాతలు, అల్లు అర్జున్, సుకుమార్ లు భావిస్తున్నారు. పుష్ప (Pushpa part one) మొదటి పార్టు ఈమధ్య మాస్కో అంతర్జాతీయ సినిమా పండగ (Moscow International Film Festival) లో స్క్రీన్ (Screen) చేసిన సంగతి తెలిసిందే కదా. పుష్ప (Pushpa) మొదటి పార్టు (First part) గొప్పగా పేరు తెచ్చుకోవటం తో రెండో పార్టు అంచనాలకు మించి తీయాలని భావిస్తున్నారు. 


ఇందుకోసం సుకుమార్ టీం (Sukumar team) ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ని ఈ సినిమా కోసం తీసుకోవాలని భావిస్తున్నట్టుగా ఒక వార్త అందింది. పుష్ప మొదటి పార్టు లో సమంత (Samantha) ఐటెం సాంగ్ (Item Song) ప్రపంచం అంత ఉర్రూతలూగించిన సంగతి తెలిసిందే కదా. అందుకని రెండో పార్టు లో ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఐటెం సాంగ్ (Item Song) పెట్టాలని ఈ సినిమా మేకర్స్ భావిస్తున్నట్టు తెలిసింది. ఇందుకోసం సుకుమార్ టీం పావులు కదుపుతున్నారని తెలిసింది. ప్రియాంక చోప్రా పేరు ఒక్క ఇండియా (India) లోనే కాకుండా, హాలీవుడ్ (Hollywood) లో కూడా బాగా వినపడుతుంది. అందుకోసం ఆమె ఐటెం సాంగ్ పెడితే సినిమా ఎక్కడికో వెళుతుందని అనుకుంటున్నట్టు, అందుకోసం, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ని మొదటి పార్టు ఐటెం సాంగ్ కన్నా ఇంకా అదిరిపోయే సాంగ్ తయారు చెయ్యాలని సూచించినట్టు తెలిసింది. అయితే ఈ వార్తలు ఆ చిత్ర యూనిట్ వాళ్ళు ఇంకా నిర్ధారించవలసి వుంది. అయితే షూటింగ్ త్వరలోనే మొదలు పెట్టబోయే ఈ సినిమా ఐటెం సాంగ్ గురించి అప్పుడే మాట్లాడటం బాగోదని యూనిట్ లో ఒక సభ్యుడు చెప్పాడు. 


Updated Date - 2022-09-27T22:32:06+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!