ప్రియమణి ‘భామాకలాపం’ వీడియో గ్లింప్స్ అదిరింది
ABN, First Publish Date - 2022-01-17T15:04:56+05:30
జాతీయ ఉత్తమనటి ప్రియామణి.. ఇటీవల ‘ఫ్యామిలీమేన్ వెబ్ సిరీస్‌తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం డ్యాన్స్ రియాలిటీ షోస్ కు జడ్జ్ గా వ్యహరిస్తూనే, తన స్థాయికి తగ్గ పాత్రలు వస్తే వదిలిపెట్టడం లేదు. ఈ నేపథ్యంలో ప్రియా నటిస్తున్న వెబ్ ఫిల్మ్ ‘భామాకలాపం’. ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ కోసం రూపొందుతోన్న మూవీ డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాబోతోంది. ఇందులో ప్రియామణి గృహిణిగా డిఫరెంట్ గెటప్ లో కనిపించబోతున్నారు. తాజాగా ‘భామాకలాపం’ వెబ్ మూవీకి సంబంధించిన వీడియో గ్లింప్స్ విడుదలైంది. దీనికి మంచి స్పందన వస్తోంది.

ఇంట్లో రకరకాల పనులు చేస్తూ ఎప్పుడూ బిజీగా ఉండే గృహిణికి గృహోపకరణాలే ఆయుధాలు అవుతాయి. అన్ని పనుల్నీ ఒంటిచేత్తో పూర్తి చేసే అలాంటి వారిది మామూలు ఎనర్జీకాదు. అందుకే ‘భామా కలాపం’ ఫస్ట్ లుక్ పోస్టర్ పై ప్రియామణిని ఆదిపరాశక్తిగా ఎలివేట్ చేశాడు దర్శకుడు అభిమన్యు తడిమేటి. రకరకాల వస్తువుల్ని ఆయుధాలుగా పట్టుకున్నట్టు చూపించాడు. 1000 వంటకాలతో విజయవంతమైన యూట్యూబర్ గా ప్రియమణి ఇందులో నటిస్తోంది. థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన వెబ్ ఫిల్మ్ త్వరలోనే ఆహాలో స్ట్రీమ్ కాబోతోంది. ‘డియర్ కామ్రేడ్’ దర్శకుడు భరత్ కమ్మ సమర్ఫణలో ఈ వెబ్ ఫిల్మ్ రూపొందుతోంది.