Prithviraj Sukumaran: ‘సలార్’ లో నటిస్తున్నందుకు గర్వపడుతున్నాను.. పాత్రను అంగీకరించడానికి కారణమేంటంటే..

ABN , First Publish Date - 2022-10-17T22:02:53+05:30 IST

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌ (Prabhas) హీరోగా నటిస్తున్న సినిమా ‘సలార్’ (Salaar). ప్ర‌శాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వం వహిస్తున్నాడు. హోంబ‌లే ఫిలింస్ బ్యానర్‌పై విజ‌య్ కిరగందూర్

Prithviraj Sukumaran: ‘సలార్’ లో నటిస్తున్నందుకు గర్వపడుతున్నాను.. పాత్రను అంగీకరించడానికి కారణమేంటంటే..

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌ (Prabhas) హీరోగా నటిస్తున్న సినిమా ‘సలార్’ (Salaar). ప్ర‌శాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వం వహిస్తున్నాడు.  హోంబ‌లే ఫిలింస్ బ్యానర్‌పై విజ‌య్ కిరగందూర్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఈ చిత్రంలో ప్ర‌తి నాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. అతడు అక్టోబర్ 16న పుట్టిన‌రోజు జరుపుకొంటున్నాడు. ఈ నేపథ్యంలో మేకర్స్ ‘సలార్’లో అతడి లుక్‌ను విడుదల చేశారు. పృథ్వీరాజ్ ఈ మూవీలో వ‌ర‌ద‌రాజ మ‌న్నార్ (Vardharaja Mannaar) పాత్రలో  కనిపించనున్నాడు. తాజాగా పృథ్వీరాజ్ హాలీవుడ్ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ‘సలార్’ చేయడానికి గల కారణాలను తెలిపాడు. ఈ సినిమాకు నో చెప్పకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని తెలిపాడు. 


‘‘ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘సలార్’. హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరు ఈ మూవీకి ఒకే చెబుతారు. ప్రభాస్ ‘సాహో’ తర్వాత యాక్షన్ సినిమాలకు దూరంగా ఉన్నాడు. కొన్నేళ్ల తర్వాత డార్లింగ్ మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం గురించి నేను ఎక్కువ చెప్పలేను. ఈ మూవీ కథలో కీలక భాగం నాకు, ప్రభాస్‌కు మధ్యే నడుస్తుంది. ‘కెజియఫ్-2’ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్నందుకు నాకు గర్వంగా ఉంది. కొద్ది రోజులు షూటింగ్ చేయగానే ఈ మూవీ అద్భుతమైన అనుభూతినిచ్చింది. నటుడిగా, సినిమా అభిమానిగా ఈ చిత్రం కోసం నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపాడు. ‘సలార్’ ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న విడుదల కానుంది. ఇదే రోజు బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ నటించిన ‘ఫైటర్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ చిత్రాల దర్శకుడిగా అతడికి మంచి పేరుంది. అందువల్ల బాక్సాఫీస్ వద్ద ‘సలార్’కు గట్టి పోటీ తప్పేలా లేదు.   

Updated Date - 2022-10-17T22:02:53+05:30 IST