సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Prince : విడుదల అప్పుడే !

ABN, First Publish Date - 2022-06-21T20:41:11+05:30

తమిళ టాలెంటెడ్ హీరో శివకార్తికేయన్ (Shivakarthikeyan), విదేశీ బ్యూటీ మరియా (Maria) జంటగా.. అనుదీప్ కెవీ (Anudeep KV) దర్శకత్వంలో రూపొందుతోన్న కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ప్రిన్స్’ (Prince).

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తమిళ టాలెంటెడ్ హీరో శివకార్తికేయన్ (Shivakarthikeyan), విదేశీ బ్యూటీ మరియా (Maria) జంటగా.. అనుదీప్ కెవీ (Anudeep KV) దర్శకత్వంలో రూపొందుతోన్న కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ప్రిన్స్’ (Prince). ఇటీవల ‘డాన్’ (Don) సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శివకార్తికేయన్, ‘జాతిరత్నాలు’ (Jathiratnalu) చిత్రంతో బ్లాక్ బస్టర్ కైవసం చేసుకున్న అనుదీప్ కలయికలో రానుండడంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా ఏకకాలంలో రూపొందుతోంది. సురేశ్ ప్రొడక్షన్స్, శాంతిటాకీస్ బ్యానర్స్ పై చిత్రం సంయుక్తంగా నిర్మాణం జరుపుకుంటోంది.


సత్యరాజ్ (Satyaraj) కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదల ఎప్పుడనేది ఒక వీడియోతో ప్రకటించారు మేకర్స్. హీరో శివకార్తికేయన్, హీరోయిన్ మరియా, సత్యరాజ్, దర్శకుడు అనుదీప్‌ల సరదా సంభాషణతో నిండిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సత్యరాజ్, శివకార్తికేయన్ సినిమా ఎప్పుడు విడుదలవుతుందని అడిగిన దానికి.. ఏవేవో మాట్లాడుతున్న అనుదీప్‌ను.. సినిమా ఎప్పుడు విడుదలవుతుందో చెప్పమని గట్టిగా అడుగుతాడు శివకార్తికేయన్... సినిమా దీపావళికి విడుదలవుతుందని చివరికి దర్శకుడు ప్రకటించడం ఆకట్టుకుంటోంది. ప్రిన్స్ గా శివకార్తికేయన్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై మరింతగా అంచనాలు నెలకొన్నాయి. మరి ప్రిన్స్ గా శివకార్తికేయన్ ఏ స్థాయిలో సక్సెస్ అందుకుంటాడో చూడాలి. 



Updated Date - 2022-06-21T20:41:11+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!