Praveen sattaru: ఆర్గానిక్‌ యాక్షన్‌ సినిమా

ABN , First Publish Date - 2022-07-10T00:47:29+05:30 IST

‘‘నాగార్జున(Akkineni nagarjuna)తో సినిమా చేసే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నాను. నాకు యాక్షన్‌ సినిమాలంటే ఇష్టం. నాగార్జున గారు స్టైలిష్‌ యాక్షన్‌ క్యారెక్టర్స్‌లో అద్భుతంగా ఉంటారు. ఈ చిత్రంలో అది గొప్పగా కుదిరింది’’ అని ప్రవీణ్‌ సత్తారు అన్నారు. నాగార్జున హీరోగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించిన చిత్రం ‘ద ఘోస్ట్‌’. శనివారం ఈ చిత్రంలోని కిల్లింగ్‌ మెషీన్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు.

Praveen sattaru: ఆర్గానిక్‌ యాక్షన్‌ సినిమా

‘‘నాగార్జున(Akkineni nagarjuna)తో సినిమా చేసే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నాను. నాకు యాక్షన్‌ సినిమాలంటే ఇష్టం. నాగార్జున గారు స్టైలిష్‌ యాక్షన్‌ క్యారెక్టర్స్‌లో అద్భుతంగా ఉంటారు. ఈ చిత్రంలో అది గొప్పగా కుదిరింది’’ అని ప్రవీణ్‌ సత్తారు అన్నారు. నాగార్జున హీరోగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించిన చిత్రం ‘ద ఘోస్ట్‌’. (The ghost) శనివారం ఈ చిత్రంలోని కిల్లింగ్‌ మెషీన్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘సినిమా మొదలైన తర్వాత కరోనా రూపంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఇబ్బంది పెట్టాయి. అయినా సరే నిర్తాలు సునీల్‌ నారంగ్‌, పూస్కుర్‌ రామ్మోహన్‌రావు, శరత్‌ మరార్‌ గొప్ప సపోర్ట్‌గా నిలబడ్డారు. చిత్ర బృందం సపోర్ట్‌తో సినిమా పూర్తి చేశాం. ఇది మిషన్‌ బేస్డ్‌ సినిమా కాదు. సినిమా సక్సెస్‌ అయితే ఎన్ని సీక్వెల్స్‌ అయినా తీసుకోవచ్చు. అలాంటి కథ ఇది. నాగార్జునలాంటి రొమాంటిక్‌ హీరోతో ఇలాంటి యాక్షన్‌ కథ తీసి ఇబ్బంది పెట్టారా? అని చాలామంది అడుగుతున్నారు. ఆ విషయంలో నాగార్జున గారు నన్ను చాలా సర్ర్పైజ్‌ చేశారు. చాలా అలోచించి ఒక యాక్షన్‌ బ్లాక్‌ పెడితే. ఆయన వచ్చి చాలా ఫాస్ట్‌గా పూర్తి చేసేవారు. ఇందులో 12 భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ ఉన్నాయి. హీరోగా ఆయన చాలా ఫ్లెక్స్‌ బుల్‌గా చేశారు. ఇందులో యాక్షన్‌, ఎమోషన్‌ కథలో కలిసి ఉంటాయి. యాక్షన్‌ చాలా ఆర్గానిక్‌ గా వుంటుంది’’ అని అన్నారు. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో వహించిన ఈ చిత్రంలో సోనాల్‌ చౌహన్‌, గుల్‌ పనాగ్‌ కీలక పాత్రధారులు. అక్టోబర్‌ 5న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్‌లలో విడుదల చేయనున్నారు. (The ghost trailer launch)




Updated Date - 2022-07-10T00:47:29+05:30 IST