Prashanth Neel: బర్త్ డే సెలబ్రేషన్స్‌లో పాన్ ఇండియన్ స్టార్స్..

ABN , First Publish Date - 2022-06-04T18:18:05+05:30 IST

ఈరోజు సెన్షేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) బర్త్ డే. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకంగా విషెస్ చెబుతున్నారు.

Prashanth Neel: బర్త్ డే సెలబ్రేషన్స్‌లో పాన్ ఇండియన్ స్టార్స్..

ఈరోజు సెన్షేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) బర్త్ డే. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకంగా విషెస్ చెబుతున్నారు. ఉగ్రం (Ugram) సినిమాతో దర్శకుడిగా మారిన ప్రశాంత్ నీల్, ఆ తర్వాత రూపొందించిన కేజీఎఫ్ (KGF) సిరీస్‌తో పాన్ ఇండియా వైడ్‌గా పాపులారిటీ తెచ్చుకున్నారు. యాక్షన్ చిత్రాలను తనొక డిఫరెంట్ థీమ్మ్ తో తెరకెక్కిస్తారని సౌత్ సినిమా ఇండస్ట్రీలలో మాత్రమే కాకుండా బాలీవుడ్ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. ఇక ప్రశాంత్ నీల్ మేకింగ్ స్టైల్ మన టాలీవుడ్ స్టార్ హీరోలను, నిర్మాతలను ఎంతగానో ఆకట్టుకుంది. 


అందుకే, ఆయనతో ప్రముఖ నిర్మాణ సంస్థలు, స్టార్ హీరోలు సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే, హోంబలే (Hombale) నిర్మాణ సంస్థలో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్ 'సలార్' (Salar) చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీని తర్వాత యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ సినిమాను 2023, ఏప్రిల్ నుంచి సెట్స్ మీదకు తీసుకురాబోతున్నారు. దీని తర్వాత యష్‌తో కేజీఎఫ్ 3 (KGF 3) తెరకెక్కించనున్న ప్రశాంత్ నీల్.. అల్లు అర్జున్ (Allu Arjun), రామ్ చరణ్ (Ram Charan), మరోసారి ప్రభాస్‌ (Prabhas)తో ప్రాజెక్ట్స్ చేసేందుకు స్క్రిప్ట్స్ రెడీ చేసుకుంటున్నారట.


అయితే, నేడు ఆయన బర్త్ డే సందర్భంగా హోంబలే సంస్థలో గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ జరిపారు. ఈ సెలబ్రేషన్స్‌లో పాన్ ఇండియన్ స్టార్స్ ప్రభాస్ (Prabhas), యష్ (Yash) కూడా సందడి చేసి ప్రశాంత్ నీల్‌కు విషెస్ చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోష మీడియా ద్వారా ఆయనకు బర్త్ డే విషెస్ తెలిపింది. ఈ క్రమంలోనే మరికొంతమంది సెలబ్రిటీస్ కూడా ప్రత్యేకంగా నీల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 











Updated Date - 2022-06-04T18:18:05+05:30 IST