సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘ది కశ్మీర్ ఫైల్స్’పై ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2022-03-18T22:53:35+05:30

విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ తాజాగా ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రంపై చేసిన ట్వీట్ సంచలనాన్ని క్రియేట్ చేస్తుంది. అందులో ఓ వీడియోను పోస్ట్ చేసిన ప్రకాశ్ రాజ్.. ‘కశ్మీర్ ఫైల్స్ చిత్రం గాయాలను నయం చేస్తుందా? లేక..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ తాజాగా ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రంపై చేసిన ట్వీట్ సంచలనాన్ని క్రియేట్ చేస్తుంది. అందులో ఓ వీడియోను పోస్ట్ చేసిన ప్రకాశ్ రాజ్.. ‘కశ్మీర్ ఫైల్స్ చిత్రం గాయాలను నయం చేస్తుందా? లేక మరింత రెచ్చగొడుతుందా? లేదంటే ద్వేషం అనే విత్తనాలను నాటుతుందా?’’.. జస్ట్ ఆస్కింగ్ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో ఈ చిత్రాన్ని వ్యతిరేకిస్తున్న వారిలో ప్రకాశ్ రాజ్ కూడా ఒకరు అన్నట్లుగా నెటిజన్లు కామెంట్స్ మొదలెట్టారు. ఆయన పోస్ట్ చేసిన వీడియోలో ఒక వ్యక్తి.. ఈ సినిమాపై తనదైన తరహాలో కామెంట్స్ చేస్తున్నారు. దీనిని బేస్ చేసుకునే ప్రకాశ్ రాజ్ ఈ ట్వీట్ చేశారు. 


మరో వైపు ఈ చిత్రం రోజురోజుకు ఊహించని విధంగా కలెక్షన్లు సాధిస్తూ.. అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ప్రధాని మోదీ నుండి.. బీజేపీ నాయకులెందరో ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంకా ప్రముఖులెందరో ఈ చిత్రాన్ని పొగుడుతూనే ఉన్నారు. కొన్ని రాష్ట్రాలు అయితే ఈ చిత్రానికి టాక్స్ బెనిఫిట్స్ కూడా ప్రకటించాయి. ఇలా అద్భుతమైన స్పందనతో దూసుకుపోతున్న ఈ చిత్రంపై తాజాగా ప్రకాశ్ రాజ్ చేసిన కామెంట్స్.. ప్రస్తుతం టాక్ ఆఫ్ ద సోషల్ మీడియాగా మారాయి. కాగా, 1990‌లో కాశ్మీర్ పండిట్ల ఊచకోత నేపథ్యంలో యదార్థ సంఘటనలతో ఈ చిత్రాన్ని దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి తెరకెక్కించారు.



Updated Date - 2022-03-18T22:53:35+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!