సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Prakash Raj: రంగమార్తాండ ఆలస్యానికి కారణం ప్రకాష్ రాజ్?

ABN, First Publish Date - 2022-10-12T20:06:23+05:30

ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ (Director Krishna Vamsi) 'రంగ మార్తాండ' (Ranga Maarthanda) అనే సినిమా ద్వారా మళ్ళీ ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాడు. ఇది మరాఠీ సినిమా 'నటసామ్రాట్'

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ (Director Krishna Vamsi) 'రంగ మార్తాండ' (Ranga Maarthanda) అనే సినిమా ద్వారా మళ్ళీ ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాడు. ఇది మరాఠీ సినిమా 'నటసామ్రాట్' (It's a remake of Marathi film 'Natasamrat') కి రీమేక్. మరాఠీ సినిమాలో నానా పటేకర్ (Nana Patekar) ముఖ్య భూమిక పోషించాడు, తెలుగులో అదే పాత్రని ప్రకాష్ రాజ్ (Prakash Raj) చేస్తున్నాడు. ఇంకా మిగతా పాత్రల్లో రమ్యకృష్ణ (Ramya Krishnan), రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj), వంశీ చాగంటి (Vamsi Chaaganti), అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj), శివాత్మికా రాజశేఖర్ (Shivatmika Rajasekhar), అలీ రెజా (Ali Reza) కూడా చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఈ సంవత్సరం జనవరి లోనే షూటింగ్ అయిపొయింది అని, ఒక్క డబ్బింగ్ (Dabbing) మాత్రమే మిగిలి ఉందని తెలిసింది.


కానీ ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ డబ్బింగ్ చెప్పక పోవటం వల్లే ఈ సినిమా ఇన్నాళ్లు ఆలస్యం అయిందని కూడా ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ప్రకాష్ రాజ్ ఈ సినిమాకి చాల డబ్బులు డిమాండ్ చేసినట్టుగా చెపుతున్నారు, అందుకు కృష్ణ వంశి సగం డబ్బు పంపించి, డబ్బింగ్ చెప్పాక మిగతా సగం ఇస్తాను అని అన్నాడు అని ఒక వార్త చక్కర్లు కొట్టింది. అయితే ప్రకాష్ రాజ్ మొత్తం అమౌంట్ ఒక్కసారే పే చెయ్యాలని డిమాండ్ చేసాడని, లేదంటే డబ్బింగ్ చెప్పను అని మొండికేశాడని ఒక వార్త పరిశ్రమలో నడుస్తోంది. విశేషం ఏంటి అంటే ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ లీడ్ యాక్టర్ గా చేస్తున్నాడు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ డబ్బింగ్ చెపుతున్నాడని పత్రికా ప్రకటన విడుదల చేసారు. ఈ సినిమా 2019 లో కృష్ణ వంశి మొదలు పెట్టాడు. కృష్ణ వంశి ప్రకాష్ రాజ్ కథ కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళితే, 'గోవిందుడు అందరి వాడేలే' (Govindudu Andari Vaadele) సినిమా లో రామ్ చరణ్ (Ram Charan) తాతగా తమిళ్ యాక్టర్ రాజ్ కిరణ్ (Tamil actor Raj Kiran) ని ముందుగా తీసుకొని షూటింగ్ కూడా చేసారు. అప్పుడు చిరంజీవి (Mega Star Chiranjeevi) కలుగచేసుకొని కృష్ణ వంశి కి ప్రకాష్ రాజ్ కి రాజీ కుదిర్చారు. మళ్ళీ ఇప్పుడు అదే ప్రకాష్ రాజ్, కృష్ణ వంశి సినిమా ఆలస్యం అవటానికి కారణం (Prakash Raj is the reason to delay Ranga Marthanda) అవుతున్నాడు. ప్రకాష్ రాజ్ మీద ఇలా విమర్శలు చాలా వున్నా, ఎవరూ బయటకి చెప్పారు, ఎందుకంటే అతనికి పరిశ్రమలో వున్నా కొంతమంది పెద్దవాళ్ళ అండదండలు  పుష్కలంగా వున్నాయి.

Updated Date - 2022-10-12T20:06:23+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!