Love Today: ఫోన్స్ మార్చుకోవడంతోనే బయటపడ్డ ప్రేమికుల రహస్యాలు
ABN , First Publish Date - 2022-11-17T21:38:49+05:30 IST
కోలీవుడ్ నటుడు ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) హీరోగా నటించిన సినిమా ‘లవ్ టుడే’ (Love Today). ప్రదీపే దర్శకత్వం వహించాడు. ఇవానా (Ivana) హీరోయిన్‌గా నటించింది.

కోలీవుడ్ నటుడు ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) హీరోగా నటించిన సినిమా ‘లవ్ టుడే’ (Love Today). ప్రదీపే దర్శకత్వం వహించాడు. ఇవానా (Ivana) హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం కోలీవుడ్‌లో సంచలన విజయం సాధించింది. నిర్మాతలకు భారీ స్థాయిలో లాభాలను పంచి పెట్టింది. రూ.3కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ తమిళనాడులో రూ.20కోట్లకు పైగా షేర్‌ను కొల్లగొట్టింది. ‘లవ్ టుడే’ త్వరలోనే తెలుగులో విడుదల కానుంది. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. యూత్‌ను ఆకట్టుకునే అంశాలతో మూవీ రూపొందినట్టు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతుంది.
యాత్ ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ‘లవ్ టుడే’ రూపొందింది. నీ గురించి నాకు మొత్తం తెలుసురా అని హీరోయిన్ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. నాకు నీ గురించి మొత్తం తెలుసు బేబీ అని హీరో చెబుతాడు. తమ ప్రేమ గురించి చెప్పడానికి వీరిద్దరు హీరోయిన్ తండ్రి వద్దకు వెళతారు. అప్పుడు హీరోయిన్ తండ్రి.. ఒకే ఒక్క రోజు వీరిద్దరిని ఫోన్స్ మార్చుకోమంటాడు. రేపు కూడా మీరిద్దరు వచ్చి ఒకే అని చెబితే.. నాకు డబుల్ ఒకే అని చెప్తాడు. పోన్స్ మార్చుకోవడంతోనే ప్రేమికుల డర్టీ సీక్రెట్స్ బట్టబయలవుతాయి. నిజాలు బయటికి వచ్చాక.. వీరి రిలేషన్ షిప్ పెళ్లి దాకా వెళ్లిందా లేదా విడిపోయారా..? అనే ఆసక్తికర అంశాలతో సినిమా రూపొందింది. ఈ చిత్రం నవంబర్‌లో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశాడు. ఈ మూవీలో సత్యరాజ్, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు.