మాస్టర్ ఓ మై మాస్టర్
ABN , First Publish Date - 2022-06-25T07:10:05+05:30 IST
దర్శకుడిగా, నిర్మాతగా బిజీ ఉన్న ప్రభుదేవా అప్పుడప్పుడు నటుడిగా కూడా తన ప్రతిభను చాటుకుంటున్నారు.
దర్శకుడిగా, నిర్మాతగా బిజీ ఉన్న ప్రభుదేవా అప్పుడప్పుడు నటుడిగా కూడా తన ప్రతిభను చాటుకుంటున్నారు. ఆర్టిస్ట్‌గా ఆయన తాజా చిత్రం ‘మై డియర్ భూతం’. వైవిధ్యభరితమైన కథతో కిడ్స్ ఫ్యాంటసీ మూవీగా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో పలు చిత్రాలను రూపొందించిన ఎన్.రాఘవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో రమేశ్ పి.పిళ్లై నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు ఏఎన్ బాలాజీ. చిత్రం షూటింగ్ పూర్తయింది. సినిమాలోని తొలి గీతాన్ని విడుదల చేశారు. ‘మాస్టర్ ఓ మై మాస్టర్’ అంటూ ఫాస్ట్ బీట్తో సాగే ఈ పాటలో ప్రభుదేవా డాన్స్ హైలైట్ అయింది. చల్లా భాగ్యలక్ష్మి రాసిన ఈ పాటను డి.ఇమ్మాన్ స్వరపరిచారు. ఈ చిత్రంలో జీనీగా ప్రభుదేవా నటిస్తున్నారు. ఆ పాత్ర చుట్టూ తిరిగే ఆసక్తికరమైన కథ ఇదని దర్శకనిర్మాతలు చెప్పారు. త్వరలో విడుదల తేదిని ప్రకటిస్తామన్నారు.