ప్రభాస్ Raja Deluxe కు ముహూర్తం ఫిక్స్.. హీరోయిన్ ఎవరంటే..!

ABN , First Publish Date - 2022-05-08T23:20:29+05:30 IST

పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న నటుడు ప్రభాస్ (Prabhas). ‘బాహుబలి’ (Baahubali) ప్రాంచైజీతో ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు అభిమానులను సంపాదించుకున్నాడు.

ప్రభాస్ Raja Deluxe కు ముహూర్తం ఫిక్స్.. హీరోయిన్ ఎవరంటే..!

పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న నటుడు ప్రభాస్ (Prabhas). ‘బాహుబలి’ (Baahubali) ప్రాంచైజీతో ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు అభిమానులను సంపాదించుకున్నాడు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేసిన సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద పరాజం పాలయ్యాయి. ‘సాహో’ (saaho), ‘రాధేశ్యాం’ (Radhe Shyam) చిత్రాలు ప్రేక్షకులను ఆశించిన మేర మెప్పించలేదు. దీంతో కమర్షియల్‌గా సక్సెస్ అందుకోవాలని మారుతి (Maruthi) దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు  ప్రభాస్ అంగీకరించాడు. ఈ చిత్రానికీ ‘రాజా డీలక్స్’ ( Raja Deluxe) అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమా షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. 


‘రాజా డీలక్స్’ను డివివి. దానయ్య (DVV Danayya) నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సూపర్ నేచురల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా షూటింగ్‌ను ఆగస్టు నుంచి ప్రారంబించబోతున్నారని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. చిత్ర బృందం మాళవిక మోహనన్‌ (Malavika Mohanan) ను హీరోయిన్‌గా ఎంపిక చేసిందట. ‘రాజాడీలక్స్’ షూటింగ్ ఈ ఏడాది జూన్‌లోనే ప్రారంభం కావాలి. కానీ, పలు కారణాల వల్ల సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. ప్రభాస్ కూడా ‘ప్రాజెక్ట్-కె’, ‘సలార్’ సినిమాల షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. రాబోయే రెండు, మూడు నెలల వరకు అతడి డేట్స్ ఖాళీగా లేవు. మారుతి కూడా ప్రీ ప్రొడక్షన్ వర్క్‌కు మరింత సమయం కావాలని అడుగుతున్నాడట. అందువల్ల ఆగస్టు నుంచి షూటింగ్ ప్రారంభించాలనే ఆలోచనలో చిత్రబృందం ఉందని సమాచారం. ‘రాజాడీలక్స్’ ను తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. ఇక ప్రభాస్ కెరీర్ విషయానికి వస్తే.. ఓంరౌత్ తెరకెక్కించిన ‘ఆదిపురుష్’ (Adipurush) సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. ‘సలార్’ (Salaar)ను వేసవిలో విడుదల చేయనున్నారు. మాళవిక మోహనన్ కూడా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. షాహిద్ కపూర్ సరసన ‘యుధ్ర’ (Yudhra) సినిమాలో నటిస్తుంది. 
Updated Date - 2022-05-08T23:20:29+05:30 IST

Read more