సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

పెదనాన్నకు స్పెషల్ విషెస్: ప్రభాస్

ABN, First Publish Date - 2022-01-20T18:06:17+05:30

డార్లింగ్ ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజుకు స్పెషల్‌గా బర్త్ డే విషెస్ తెలిపారు. నేడు (జనవరి 20) లెజండరీ నటుడు కృష్ణంరాజు పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రపరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు ఆయనకు ప్రత్యేకంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డార్లింగ్ ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజుకు స్పెషల్‌గా బర్త్ డే విషెస్ తెలిపారు. నేడు (జనవరి 20) లెజండరీ నటుడు కృష్ణంరాజు పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రపరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు ఆయనకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కూడా తన పెదనన్నాకు సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ పోస్ట్ పెట్టారు. "మా అంకుల్ ది రెబల్ స్టార్ కృష్ణం రాజు గారికి బర్త్ డే విషెష్ తెలియజేస్తున్నాను. మీ వివేకం, గైడెన్స్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను." అంటూ పోస్ట్‌లో పేర్కొన్నారు ప్రభాస్. పెదనాన్న ఆశీస్సులతోనే హీరోగా టాలీవుడ్‌కు పరిచయమైన ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పెదనాన్నతో కలిసి 'బిల్లా', 'రెబల్' చిత్రాలలో కలిసి నటించారు. త్వరలో 'రాధే శ్యామ్' సినిమాలోనూ ఇద్దరు కలిసి స్క్రీన్ మీద సందడి చేయబోతున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి.  



Updated Date - 2022-01-20T18:06:17+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!